
మాంచెస్టర్ : యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ తన భీకరపామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆటలో స్మిత్(100, 163 బంతుల్లో) సెంచరీ సాధించి టెస్టు కెరీర్‌లో 26 వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండోరోజు లంచ్ సమయానికి ఆసీస్ 5 వికెట్లకు 245 పరుగులు చేసింది. మొదటిరోజు 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్నస్ లబుషేన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. లబూషేన్ ఔటయ్యాక ఇతర బ్యాట్సమెన్‌ల సహకారంతో రెండోరోజు ఆటను కొనసాగించిన స్మిత్ 163 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్‌కు ఈ సిరీస్‌లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. కాగా, మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.