‘నా గుండె పగిలింది, ఐ యామ్‌ సారీ’ | Ariana Grande tweets after blast at her concert kills 19: 'Broken, I am so so sorry' | Sakshi
Sakshi News home page

‘నా గుండె పగిలింది, ఐ యామ్‌ సారీ’

Published Tue, May 23 2017 10:15 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

‘నా గుండె పగిలింది, ఐ యామ్‌ సారీ’ - Sakshi

‘నా గుండె పగిలింది, ఐ యామ్‌ సారీ’

లండన్: మాంచెస్టర్‌ దాడిపై అమెరికా పాప్‌ గాయని, నటి అరియానా గ్రాండే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన తనను ఎంతోగానో కలసి వేసిందని ఆవేదన తెలిపింది. మాంచెస్టర్‌లో దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ఆమె స్పందించింది. ‘నా గుండె పగిలింది. ఐ యామ్‌ సారీ. ఏం చెప్పాలో మాటలు రావడం లేద’ని అరియానా ట్వీట్‌ చేసింది.

మాంచెస్టర్‌ ఎరీనాలో అరియానా ప్రదర్శన ముగిసిన తర్వాత మాంచెస్టర్‌ ఎరీనా గేటు దగ్గర పేలుడు సంభవించడంతో 20 మంది చనిపోగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరియానా షోకు 21 వేల మంది హాజరయ్యారని తెలుస్తోంది. వేదిక కెపాసిటీ 18 వేలు మాత్రమే. మెన్‌ ఎరీనాగా ముద్ర పడిన మాంచెస్టర్‌ ఎరీనాలో తరచుగా పాప్‌ సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. బర్మింగ్‌హామ్‌, డబ్లిన్‌లో ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చిన అరియానా రేపు, ఎల్లుండి లండన్‌ ప్రదర్శనలు ఇవాల్సివుంది. ఈలోగా మాంచెస్టర్‌లో దాడి జరిగింది. దీంతో తదుపరి కార్యక్రమాలపై సందిగ్దత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement