
ఖాతర్ విమానానికి రక్షణగా వస్తున్న బ్రిటీష్ యుద్ధ విమానం
దోహా నుంచి మాంచెస్టర్ వచ్చిన ఖాతర్ ఎయిర్వేస్ విమానంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లండల్: దోహా నుంచి మాంచెస్టర్ వచ్చిన ఖాతర్ ఎయిర్వేస్ విమానంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తి వివరాలు వెల్లడించడానికి వారు నిరాకరించారు. ఆ విమానంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు ముందుగానే అధికారులకు సమాచారం అందింది. దాంతో బ్రిటిష్ యుద్ధ విమానంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆకాశంలోనే బ్రిటీష్ యుద్ధ విమానం దానికి రక్షణగా అనుసరించింది. ఖాతర్ విమానాన్ని మాంచెస్టర్ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు. ఈ విమానంలో 269 మంది ప్రయాణికులు, 13 మంది విమాన సిబ్బంది ఉన్నారు.
విమానం కిందకు దిగే ముందు అధికారులు అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కిందకు దిగిన వెంటనే అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ఒక అనుమానిక వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానంలో అనుమానిత వస్తువులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే భద్రతాకారణాలరీత్యా వివరాలు పూర్తిగా వెల్లడించడం సాధ్యంకాదని చెప్పారు.