
మాంచెస్టర్ ఉగ్రదాడి: ట్రంప్‌పై విమర్శలు
మాంచెస్టర్ ఉగ్రదాడికి సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
మాంచెస్టర్: ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో పేలుడు ఘటనకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐసిస్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడబోతున్నట్లు అమెరికా నిఘావర్గాలు ముందే హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు ట్రంప్ వల్లే ఐసిస్ బలపడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూరప్ దేశాల్లో ఐసిస్ స్లీపర్‌సెల్స్ యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని, ఏ నిమిషంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మే2న అమెరికన్ పర్యాటకులకు ఆ దేశ నిఘావర్గాలు సందేశాలు పంపాయి. అయితే వీటిని రొటీన్‌గా తీసుకున్న ఇంగ్లాడ్.. చివరికి భారీ మూల్యం చెల్లించుకుంది.
మాంచెస్టర్ ఎరీనాలో చోటుచేసుకున్న పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 50మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎరీనాకు సమీపంలోనే మరో బాంబును పోలీసులు కనుగొన్నారు. పేలుళ్ల నేపథ్యంలో ఇంగ్లాండ్ సహా యూరోపియన్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.
ట్రంప్‌పై విమర్శలు
మాంచెస్టర్ దాడి అనంతరం యూరప్ అంతటా అమెరికా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలవల్లే ఐసిస్ బలపడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌదీఅరేబియా పర్యటన ముంగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. విమానంలో ఉండగానే ఆయనకు మాంచెస్టర్ దాడి వార్త తెలిసింది. అయితే దానిపై ఆయనగానీ, వైట్‌హౌస్‌గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.