
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో భాగంగా గురువారం మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా 'ఇది గుర్తుంచుకోండి..ఎవరైతే టీమిండియాను ఓడిస్తారో వారే ప్రపంచకప్ విజేత అవుతార'ని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (ఒకటి రద్దు) దూకుడుగా ఆడుతోందని అభిప్రాయపడ్డాడు. కాగా, విండీస్‌పై 125 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో భాగంగా కోహ్లిసేన ఆదివారం ఇంగ్లడ్‌తో తలపనుంది. ఈ సందర్భంగా వాన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.