ఆ నచ్చినవాడెవరు?
ఆ నచ్చినవాడెవరు?
Published Sun, Dec 22 2013 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
నచ్చినోడితో జీవితం పంచుకోవడం సంతోషమే కదా అంటోంది నటి త్రిష. ఈ బ్యూటీకి పెళ్లి కళ వచ్చేసిందనేది తాజా వార్త. పెళ్లెప్పుడంటూ ఎన్నోసార్లు ఎందరో అడిగిన ప్రశ్నకు ఈ చెన్నై చిన్నది బదులిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష ప్రస్తుతం చాలా జోష్‌లో ఉంది. అందుకు కారణం తాజాగా ఈ భామ నటించిన ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకోవడమే. త్రిష మాట్లాడుతూ తాను సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దం దాటిందని చెప్పింది. చిత్ర విజయం అనేది ఏ నటికైనా చాలా ముఖ్యం అని చెప్పింది. ఎండ్రెండ్రుం పున్నగై తనకు చాలా ముఖ్యమైన చిత్రం అని చెప్పింది.
ఏడాది గ్యాప్ తరువాత తమిళంలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌ను సంపాదించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. హీరోయిన్‌గా అన్ని తరహా పాత్రలు పోషించానని అందువలన ఫలానా పాత్ర పోషించాలనే కోరికలు లేవని పేర్కొంది. తన మనసుకు నచ్చిన పాత్రల్ని చేసుకుంటూ పోతున్నట్టు తెలిపింది. పెళ్లి చేసుకుంటున్నారా? అని తనను అడుగుతున్నారని ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వనున్నట్లు తెలిపింది. జీవితంలో మనసుకు నచ్చిన వాడితో భాగం పంచుకోవడం ఆనందమేగా నంటున్న ఈ ముద్దుగుమ్మ ఆ నచ్చిన వాడెవరో చెప్పలేదు.
Advertisement
Advertisement