మైలార్దేవుపల్లి (హైదరాబాద్): తన ప్రేయసికి ఒకడితో వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు. తన లవర్‌ను పెళ్లి చేసుకోవద్దు అనే ఉద్దేశంతో అతడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్బాయి, అమ్మాయి తరఫు వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీకు చెందిన నదీమ్ ఖాన్(28)కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త నదీమ్ ఖాన్ శనివారం బైక్‌పై వెళ్తుండగా ఆపి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఆ ప్రేమికుడు కిడ్నాప్ చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ అతడితో కుమార్తె ప్రేమాయణం తెలిసే కుటుంబసభ్యులు నదీమ్‌ఖాన్‌తో నిశ్చితార్థం జరిపారు.
ఇది తట్టుకోలేకనే ఆ యువకుడు నదీమ్‌ను కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ ఘటనలో అమ్మాయికి ముందుగానే సమాచారం ఉందా లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కిడ్నాప్‌లో పాల్గొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారణ చేపట్టి కిడ్నాప్‌కు గురయిన నదీమ్‌ఖాన్‌ను విడుదల చేయించేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
చదవండి: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య
చదవండి: ఘోరం నలుగురు కరోనా రోగులు సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment