mylardevpally
-
రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ
సాక్షి, రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి మైనర్ బాలుడు రాజా పాశ్వాన్(17) హత్య కేసు మిస్టరీ వీడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాలుడిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు పంకజ్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే విషయాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంకజ్ భార్యపై మైనర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ కోపంతోనే పథకం ప్రకారమే బాలుడిని పంకజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. కాగా, బీహార్‌కు చెందిన సంజయ్ పాశ్వాన్ భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడి కుమారుడు ఇదే ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో పని చేసేవాడు. శనివారం ఉదయం పనికి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం కావడంతో షాప్‌కు వెళ్తి బత్తా తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. దుకాణ యజమాని వద్దకు వెళ్లి ఆరా తీయగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణుష్య ప్రాంతంలో బండరాయిపై బాలుడు పడి ఉన్నట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పంకజ్ భార్యను బెదిరించి రాజా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన పంకజ్.. పథకం ప్రకారమే కూరగాయలు కోసే కత్తితో రాజాని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: ఉరేసుకుందా.. గుండెపోటా? -
కార్ల స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లి: కార్ల స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని టాటానగర్ ప్రాంతంలో షేక్ వాహిద్(50) అనుమతి లేని కార్ల స్క్రాప్ గోదాములను నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం షాట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోదాములో ఉన్న కార్లు, వాటి పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
ప్రేమ జంట ఆత్మహత్య
మైలార్‌దేవ్‌పల్లి: తమ ప్రేమకు అడ్డు చెప్పారని భావించిన ఓ ప్రేమ జంట అర్థాంతరంగా తనువు చాలించారు. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురై గురువారం ఒకే తాడుకు ఉరి వేసుకొని తనువులను చాలించారు. అమ్మాయి 17 ఏళ్ల మైనర్ బాలిక. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ్మ, ఎస్సై రోహిత్ తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇరు కుటుంబాలు మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్ కర్నూల్ రోడ్డు సమీపంలో ఉన్న నేతాజీనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిటికెల నారాయణ స్థానికంగా నివాసం ఏర్పర్చుకోని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. నారాయణ కుమార్తె అనూషా ఇటీవలనే ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసింది. వెయ్యి మార్కులకు గాను 990 మార్కులతో రాష్ట్రస్థాయిలో నిలిచింది. వీరి ఇంటి సమీపంలోనే ఆటో డ్రైవర్ రవి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అనూషా, రవికుమార్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్దలు మందలించారు. దీంతో రవి కుటుంబసభ్యులు ఇతర ప్రాంతానికి మకాం మార్చారు. శంషాబాద్‌లో తల్లితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైన రవి నేతాజీనగర్‌లో ఉన్న పాత ఇంటికి వచ్చాడు. అనూషాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి గురువారం తెల్లవారుజామున ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బిర్యానీ బాలేదన్న యువకులపై హోటల్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడితో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది చితకబాదిన సంఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. మటన్ బిర్యానీ బాగా లేదని చెప్పడంతో మొదలైన వాగ్వాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని దుర్గానగర్‌లో ఉన్న మెఫిల్ హోటల్‌కు ఇద్దరు స్నేహితులు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని గుర్తించి హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వాగ్వాదం మొదలు కాగా ఆగ్రహంతో హోటల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సిబ్బంది దాడిలో ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా యథాతథంగా మెఫిల్ విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ఫ్యూ సమయంలో రహాస్యంగా బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హోటల్‌పై గతంలో నాణ్యత లేని ఆహారం అందించడంతో భోజనప్రియులు ఆందోళన చేశారు. -
ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్
మైలార్దేవుపల్లి (హైదరాబాద్): తన ప్రేయసికి ఒకడితో వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు. తన లవర్‌ను పెళ్లి చేసుకోవద్దు అనే ఉద్దేశంతో అతడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్బాయి, అమ్మాయి తరఫు వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీకు చెందిన నదీమ్ ఖాన్(28)కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త నదీమ్ ఖాన్ శనివారం బైక్‌పై వెళ్తుండగా ఆపి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఆ ప్రేమికుడు కిడ్నాప్ చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ అతడితో కుమార్తె ప్రేమాయణం తెలిసే కుటుంబసభ్యులు నదీమ్‌ఖాన్‌తో నిశ్చితార్థం జరిపారు. ఇది తట్టుకోలేకనే ఆ యువకుడు నదీమ్‌ను కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ ఘటనలో అమ్మాయికి ముందుగానే సమాచారం ఉందా లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కిడ్నాప్‌లో పాల్గొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారణ చేపట్టి కిడ్నాప్‌కు గురయిన నదీమ్‌ఖాన్‌ను విడుదల చేయించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. చదవండి: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య చదవండి: ఘోరం నలుగురు కరోనా రోగులు సజీవ దహనం -
ఆస్మాబేగం కేసులో బయటపడిన సంచలన విషయం
సాక్షి, హైదరాబాద్ : వెన్నుపూసలో బుల్లెట్ బయటపడిన ఆస్మాబేగం కేసులో మంగళవారం సంచలన విషయం బయటపడింది. వెన్నులోంచి తీసిన బుల్లెట్‌ను రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆస్మాను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యంతో వైద్యం చేయించి రక్తస్రావం, నొప్పి తగ్గించారని విచారణలో వెల్లడైంది. ఇది కాకుండా, పోలీసులు ఆస్మా సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి కాల్ రికార్డ్స్ ద్వారా విచారణ జరుపుతుండగా మరో కోణం బయటపడింది. ఆస్మా తండ్రి నజీర్ మైలార్‌దేవ్‌పల్లిలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో వాచ్‌మెన్‌గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ ఫంక్షన్ హాల్ యజమాని షనవాజ్ కొడుకు జుబేర్ ఓ పెళ్లి బరాత్‌లో కాల్పులు జరిపాడు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో జుబేర్‌పై కాల్పుల కేసు నమోదైంది. ఇప్పుడు ఆస్మాబేగం కేసుతో జుబేర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను డిశ్చార్జి చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి : అంతుచిక్కని తూటా రహస్యం! -
అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చెరువులో శవాలై తెలిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. శాస్త్రీపురం కింగ్స్ కాలనీకి చెందిన నిజాముద్దీన్ కుమారుడు తౌఫిక్ (9), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ యూసుఫ్ కుమారుడు ఫారుఖ్ (11) స్నేహితులు. వీరిద్దరూ కాలాపత్తర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నారు. ఈ నెల 25వ తేదీన స్కూల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆడుకునేందుకు ఇద్దరు కలిసి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా చిన్నారుల జాడ తెలియలేదు. దీంతో శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, శనివారం ఉదయం బంరూక్ దౌలా చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాలను వెలికితీసి పరిశీలించారు. అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు తౌఫిక్, ఫారుఖ్‌లుగా గుర్తించారు. వెంటనే ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. చెరువు వద్దకు స్నానానికి వెళ్లారా..? లేక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారా..? ఎవరైనా హత్య చేసి పడవేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారుల మృతితో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య
-
మాజీ ఎంపీపై పీఎస్ లో మహిళ ఫిర్యాదు
హైదరాబాద్ : తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎంపీ తులసీరామ్ పై ఓ మహిళ ఫిర్యాదుచేసింది. తన భర్తపై దాడి చేసి తులసీరామ్ బలవంతంగా తీసుకెళ్లారంటూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను శనివారం ఓ మహిళ ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే పీఎస్‌లో కిడ్నాప్ అయినట్లు ఆరోపణలున్న వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. భూ వివాదంలో బెదిరింపులకు పాల్పడి తనతో మాజీ ఎంపీ చెక్కులు, బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేశాడు.