సాక్షి, హైదరాబాద్: స్నేహితుడితో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది చితకబాదిన సంఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. మటన్ బిర్యానీ బాగా లేదని చెప్పడంతో మొదలైన వాగ్వాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని దుర్గానగర్‌లో ఉన్న మెఫిల్ హోటల్‌కు ఇద్దరు స్నేహితులు వచ్చారు.
మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని గుర్తించి హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వాగ్వాదం మొదలు కాగా ఆగ్రహంతో హోటల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సిబ్బంది దాడిలో ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా యథాతథంగా మెఫిల్ విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ఫ్యూ సమయంలో రహాస్యంగా బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హోటల్‌పై గతంలో నాణ్యత లేని ఆహారం అందించడంతో భోజనప్రియులు ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment