కార్ల స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం  | Hyderabad: Fire Accident At Car Scrap Shop | Sakshi
Sakshi News home page

కార్ల స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం 

Published Wed, Feb 8 2023 2:33 AM | Last Updated on Wed, Feb 8 2023 8:35 AM

Hyderabad: Fire Accident At Car Scrap Shop - Sakshi

అగ్నికి అహుతైన  కార్ల స్క్రాప్‌ దుకాణం

మైలార్‌దేవ్‌పల్లి:  కార్ల స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టాటానగర్‌ ప్రాంతంలో  షేక్‌ వాహిద్‌(50) అనుమతి లేని కార్ల స్క్రాప్‌ గోదాములను నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం షాట్‌సర్క్యూట్‌ కారణంగా  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో గోదాములో ఉన్న కార్లు, వాటి పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement