నయనతార
నయనతార, విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా పండగలు చేసుకోవడాలు, కలిసి టూర్‌కి వెళ్లడాలతో వ్యక్తపరుస్తుంటారు. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో విఘ్నేశ్‌ను నయనతార ఫియాన్సీ (కాబోయే భర్త) అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఫియాన్సీ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారట. ఇటీవల దర్శకుల్లో ఎక్కువ శాతం మంది నిర్మాణంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. తాజాగా విఘ్నేశ్ కూడా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారట.
నయనతార ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘అవళ్’ (తెలుగులో గృహం) దర్శకుడు మిలింద్ రాజు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘మిస్టర్ లోకల్’ షూటింగ్ పూర్తి చేశాక విజయ్ సరసన కమిట్ అయిన కొత్త షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు నయనతార. ఆ తర్వాత తన ఫియాన్సీ నిర్మించనున్న సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment