Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్‌క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు.
మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్‌వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు.
రొటీన్‌కి భిన్నంగా..
సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్‌లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్‌లకు ఎడిటర్‌గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్‌గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్‌లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నారు.
అల్లుళ్లిద్దరూ విదేశీయులే..
ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్‌లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి.
Comments
Please login to add a commentAdd a comment