ట్రైన్ గురించి, ట్రైన్ జర్నీ గురించి దాదాపు అందరికి తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదో రకైమన అనుభూతి అనే చెప్పాలి. లయబద్దంగా కదులుతూ ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసిన వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. ఒక బోగీ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని చాలా మందికి తెలియక పోవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి వివరాలను తెలుసుకుందాం.
కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో 12,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి.
నిపుణుల అంచనాల ప్రకారం, ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ తయారీ విషయానికి వస్తే.. ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధార పడి ఉంటుంది, కావున దానికయ్యే ఖర్చు ఆ రేంజ్‍లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!)
ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ట్రైన్ చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 24 బోగీలు నాశనమైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ కోచ్‌ల మొత్తం విలువ రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment