టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తరువాత.. ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఓ నౌకను తయారు చేసింది. దీనిపేరు 'సీవైజ్ జెయింట్'. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..
సీవైజ్ జెయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. దీనిని 1974-79 మధ్య జపాన్ కంపెనీ సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది కార్గో షిప్‌గా పరిచయమైంది. దీనికి భారతదేశంతో కూడా ఓ ప్రత్యేకమైన అనుభందం ఉన్నట్లు సమాచారం.
సీవైజ్ జెయింట్ నౌకను గ్రీకు వ్యాపారవేత్త కోసం.. జపాన్ దేశంలోని ఒప్పామా షిప్‌యార్డ్‌లో నిర్మించడం ప్రారభించారు. కానీ ఓడ నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ నౌకను నిరాకరించారు. అప్పటికి నౌకకు పేరు పెట్టలేదు. ఆ తరువాత తయారీ సంస్థ, ఆర్డర్ చేసిన యజమానికి మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.
ఒప్పామా షిప్‌యార్డ్‌లో ఈ అతిపెద్ద నౌకను నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఒప్పమా అని పేరుపెట్టారు. కంపెనీ దీనిని ఆ తరువాత చైనాకు అప్పగించడం జరిగింది. చైనా చేతుల్లోకి చేరిన తరువాత దీనికి సీవైజ్ జెయింట్ అని పేరుపెట్టారు. ఈ నౌక అప్పట్లో ముడి చమురు రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు.
1988లో సీవైజ్ జెయింట్ నౌక ఇరాన్ నుంచి చమురు తీసుకుని బయలుదేరి.. లారాక్ ద్విపంలో ఆగింది. అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది. ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది. ఈ ఓడను మరమ్మత్తులు చేయడానికే.. ఏకంగా 100 మిలియన్ డాలర్లు ఖర్చు (1988లో) అయినట్లు సమాచారం. 100 మిలియన్ డాలర్ల నేటి విలువ సుమారు 265 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2212 కోట్లు.
సీవైజ్ జెయింట్ నౌక దాదాపు 1500 అడుగుల పొడవు ఉంది. 1988 తరువాత దీనిని పూర్తిగా మరమ్మత్తు చేసి 1991లో నార్వేజియన్ కంపెనీకి విక్రయించారు. 1991 తరువాత 2009లో గుజరాత్‌లోని అలంగ్ షిప్‌బ్రేకింగ్ యార్డ్‌కు చేరుకుంది. ఆ తరువాత దీనిని కూల్చి వేశాలు. ప్రస్తుతం ఇది హాంకాంగ్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment