International Beer Day: వినడానికి, అనడానికి గమ్మత్తుగా ఉన్నా, ప్రతీ ఏడాది ఆగస్టు తొలి శుక్రవారం ప్రపంచ బీర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ బీర్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీర్ ప్రియులను ఒక్కచోట చేర్చే పండగ అదే దీని స్పెషల్. అయితే అంతర్జాతీయ బీర్ దినోత్సవం అమెరికాలో పాటించే జాతీయబీర్ దినోత్సవం కంటే భిన్నంగా ఉంటుంది.
బీర్ అనేది ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్ డ్రింక్స్‌లో ఒకటి. ఇంటర్నేషనల్ బీర్ డే సందర్బంగా మనదేశంలో బాగా పాపులర్ అయిన క్రాఫ్ట్ బీర్, ఇతర విశేషాలను తెలుసుకుందాం.
2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌లో జెస్సీ అవ్షలోమోవ్ అనే సామాన్యుడు ప్రారంభించారు. ఈ వేడుకను తొలుత ఆగస్టు 5 న జరుపుకునేవారట. కానీ ఆ తర్వాతి కాలంలో ఆగస్టు తొలి శుక్రవారం నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పురాతన ఇరాన్‌లో రసాయన అవశేషాల రూపంలో లభించిన పురాతన ఆధారాలతో బీర్ చరిత్ర సుమారు 3500-2900 బీసీ నాటిది. స్కాటిష్ బ్రూవరీ బ్రూమీస్టర్ తయారుచేసిన స్నేక్ వెనమ్ 67.5శాతం స్ట్రాంగ్‌తో ప్రపంచంలోనే అత్యంత బలమైన బీర్‌గా పేరొందింది.
1040లో జర్మనీలోని ఫ్రీసింగ్‌లో స్థాపించబడిన వీహెన్‌స్టెఫాన్ బ్రూవరీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రూవరీ. బీర్ ఉత్పత్తి చేసే తొలి ఐదు దేశాలుఅమెరికా చైనా, జర్మనీ, రష్యా, బ్రెజిల్ నిలుస్తాయి. 5వ శతాబ్దంలో పురాతన గ్రీకు రచయిత జెనోఫోన్ రచనలలో బీర్ గురించిన మొట్టమొదటి లిఖిత ప్రస్తావన ఉందని చెబుతారు.
క్రాఫ్ట్ బీర్
భారతదేశంలో బీర్ ఒక గమ్మత్తైన వ్యాపారం. ఇటీవలి వరకు మనదేశంలో స్ట్రాంగ్, లైట్ అనే బీర్‌లో ఉండేది. కానీ15 సంవత్సరాల క్రితం, ‘క్రాఫ్ట్ బీర్ ఎంట్రీ ఇచ్చి బాగా ప్రజాదరణ పొందింది. క్రాఫ్ట్ బీర్ అంటే సాంప్రదాయ బ్రూయింగ్ పద్ధతుల్లో, అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించి చిన్న, స్వతంత్ర బ్రూవరీస్ ద్వారా ఉత్పత్తి చేసే బీర్. వివిధ రకాల మాల్ట్‌లు, హాప్‌లు , ఈస్ట్ జాతులతో ప్రయోగాలతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీ, కోల్‌కత, హైదరాబాద్ నగరాలతో పాటు బెంగళూరు, పూణే , ముంబై లాంటి నగరాల్లో క్రాఫ్ట్ బీర్ విరివిగా లభిస్తుంది. ఇండియన్ క్రాఫ్ట్ బీర్ మిల్లెట్, స్థానికంగా లభించే పండ్లు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది అంటారు ఈ రంగ నిపుణులు. పలు అంచనాల ప్రకారం క్రాఫ్ట్ బీర్ పరిశ్రమ 2014-2018 మధ్య కాలంలో 304 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇక 2024-2032లో 24.41శాతం పెరుగుతుందని అంచనా.
నోట్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం.
Comments
Please login to add a commentAdd a comment