మెరుపు వేగం.. చీతాలకు ఉన్న ఈ ప్రత్యేక గుణం గురించి తెలుసా? | Project Cheetah Interesting Lesser Known Facts About Cheetahs | Sakshi
Sakshi News home page

సింహాల మాదిరే చీతాలు.. అరుదైన ఈ వన్యప్రాణి ప్రత్యేకతలు తెలుసా?

Published Sat, Sep 17 2022 2:01 PM | Last Updated on Sat, Sep 17 2022 4:22 PM

Project Cheetah Interesting Lesser Known Facts About Cheetahs - Sakshi

చీతా.. ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. తేలికగా ఉండే శరీర తత్వంతో.. పొడవాటి తోక, సన్నని పొడవైన కాళ్లతో మెరుగు వేగంతో దూసుకుపోయే తత్వం చీతాది. అదే టైంలో ఆ చూడ ముచ్చటైన స్వభావమే దాని పాలిట శాపంగా మారింది. ఆల్రెడీ భారత్‌లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. నమీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాలను కునో నేషనల్‌ పార్క్‌(ఎంపీ)లోకి వదిలారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అరుదైన ఈ వన్యప్రాణి గురించి..  


► చీతా అనే పదం.. హిందుస్థానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. 

► చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్‌ చీతాలు, ఆసియాటిక్‌ చీతాలు, నార్త్‌ఈస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు, నార్త్‌వెస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు.

► చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోనే ముగస్తుంటుంది సాధారణంగా. ఒక దూకుతో వేటను పట్టేస్తుంది. ఇది ఎంతలా అంటే.. స్పోర్ట్స్‌ కారు కంటే 
వేగంగా..!

► పిల్లి జాతి వన్యప్రాణుల్లో చీతాలది ఒక ప్రత్యేకమైన జీవనం. మగవన్నీ కలిసి జీవిస్తే.. ఆడ చీతలు మాత్రం ఒంటరిగా కూనలను పెంచుతాయి. పగలంతా వాటిని దాచేసి..  ఎలా వేటాడో నేర్పిస్తాయి. ఇక మగవన్నీ ఒక జట్టుగా ఉండి తమ సరిహద్దుల్ని కాపాడుకోవడంతో పాటు వేటను వెంటాడుతాయి. 

► చీతలకు ఉన్న మరో ప్రత్యేకత పగటి పూట వేట. పొద్దుపొద్దునే.. లేదంటే మిట్టమధ్యాహ్నాం అవి బరిలో దిగుతాయి.  సూర్యుడి కాంతి కంటి మీద పడినా.. కళ్లు రెప్పవాల్చకుండా వేటాడుతాయి అవి. తద్వారా సింహం, హైనాల లాంటి పోటీ నుంచి అవి ఊరట దక్కించుకుంటాయి. 

మ్మి.. యావ్‌
చీతా గర్జిస్తుందని పొరబడేరు.. పాపం దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల (రెండు భాగాల బోన్‌) అది గర్జించలేదు. బదులుగా.. పిల్లిలాగా మియావ్‌ అని లేదంటే షిష్‌.. అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. 

► చీతాను ఒకప్పుడు ఈజిప్ట్‌లో పరమ పవిత్రంగా, రాజసంగా భావించేవాళ్లు. ఫారోల సమాధులు, ఇతర కట్టడాలపై వాటికి ఉన్న ప్రాధాన్యతే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. 

► చీతాలు తమ సరిహద్దులు ఎక్కువగా ఉండాలని అనుకుంటాయి. కానీ, మనుషుల తాకిడితో వాటి సరిహద్దులు చెరిగిపోయి.. అంతరించే దశకు చేరుకున్నాయి. 

► సింహాలు తప్ప మిగతా జాతులన్నీ విడిగానే జీవిస్తాయి. కానీ, చీతాలు మాత్రం గుంపునే ఇష్టపడతాయి. సింహాల మాదిరే నీళ్లు కూడా తక్కువగా తాగుతాయి చీతాలు.

ఫాస్ట్‌ ఫుడ్‌ ఇష్టం
చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లను, జింకలను వేటాడుతాయి. పెద్ద వాటి జోలికి ఎక్కువగా పోవు. పైగా ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకుని త్వరగా తినేస్తాయి కూడా. 

► చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో.. తల్లి చీతాలకు చంపి.. కూనలను అక్రమ రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా అరేబియన్‌ గల్ప్‌ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అందుకే వీటి వేటను అణచివేసేందుకు ఆఫ్రికా, ఇరాన్‌ లాంటి ఆసియా దేశం కఠినచట్టాలు అమలు చేస్తున్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement