India First Billionaire Mir Osman Ali Khan: ఈ రోజు భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, లక్ష్మీ మిట్టల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇండియాలో చెప్పుకోదగ్గ బిలీనియర్ ఉండేవాడు. ఆయన గురించి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. క్వీన్ ఎలిజబెత్‌కు సైత బహుమతులు అందించిన ఆ బిలీనియర్ ఎవరు? అతని సంపద ఎంత ఉండేది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రిటీష్ పాలిత భారతదేశం ఒకప్పుడు సంపదలతో తులతూగుతూ ఉండేదని చరిత్రకారులు రాసిన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. మన దేశంలో తొలి బిలియనీర్ 'మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' (Mir Osman Ali Khan). 1886లో జన్మించిన అలీ ఖాన్ హైదరాబాద్ చివరి నిజాం రాజు. ఈయన 1911 నుంచి 1948 వరకు భారతదేశం విలీనం అయ్యే వరకు పాలించాడు.
నిజానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటీష్ వారికీ విధేయుడని, విభజన సమయంలో పాకిస్థాన్‌లో చేరాలని అక్కడే స్వాతంత్య్ర రాజ్యాన్ని పాలించాలని కలలు కన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 1980 - 90లలో ప్రపంచంలో ఉన్న పది మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఈ నిజాం రాజు కూడా ఒకరు. ఆయన సంపదకు సంబంధించిన అధికారిక వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ 2 బిలియన్ డాలర్లు (1940లో) ఉంటాయని అంచనా. ఈ సంపద విలువ ఇప్పటి కరెన్సీ ప్రకారం సుమారు 35.8 బిలియన్లతో సమానం. ఇంత సంపద అప్పట్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం.
(ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!)
ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందిన నిజాం భారతదేశపు మొదటి విమానాశ్రయం రూపొందించినట్లు చెబుతున్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చేయడంతోపాటు విద్యుత్తును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో సహా అనేక ప్రభుత్వ సంస్థలను స్థాపించిన ఘనత కూడా నిజాం వంశానిదే అని చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?)
నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇతర నిజం రాజుల మాదిరిగా దుస్తులకు, ఇతరత్రా విషయాలకు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈయన వద్ద పేపర్ వెయిట్ ఉండేదని అది 185 క్యారెట్ల వజ్రాలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఘనత కూడా నిజాం రాజు సొంతమే. దానిని క్వీన్ ఎలిజబెత్ మరణించే వరకు కూడా ఉపయోగించిందని సమాచారం.
-ఎన్. కుమార్
Comments
Please login to add a commentAdd a comment