mir osman ali khan
-
భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?
India First Billionaire Mir Osman Ali Khan: ఈ రోజు భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, లక్ష్మీ మిట్టల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇండియాలో చెప్పుకోదగ్గ బిలీనియర్ ఉండేవాడు. ఆయన గురించి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. క్వీన్ ఎలిజబెత్‌కు సైత బహుమతులు అందించిన ఆ బిలీనియర్ ఎవరు? అతని సంపద ఎంత ఉండేది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటీష్ పాలిత భారతదేశం ఒకప్పుడు సంపదలతో తులతూగుతూ ఉండేదని చరిత్రకారులు రాసిన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. మన దేశంలో తొలి బిలియనీర్ 'మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' (Mir Osman Ali Khan). 1886లో జన్మించిన అలీ ఖాన్ హైదరాబాద్ చివరి నిజాం రాజు. ఈయన 1911 నుంచి 1948 వరకు భారతదేశం విలీనం అయ్యే వరకు పాలించాడు. నిజానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటీష్ వారికీ విధేయుడని, విభజన సమయంలో పాకిస్థాన్‌లో చేరాలని అక్కడే స్వాతంత్య్ర రాజ్యాన్ని పాలించాలని కలలు కన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 1980 - 90లలో ప్రపంచంలో ఉన్న పది మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఈ నిజాం రాజు కూడా ఒకరు. ఆయన సంపదకు సంబంధించిన అధికారిక వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ 2 బిలియన్ డాలర్లు (1940లో) ఉంటాయని అంచనా. ఈ సంపద విలువ ఇప్పటి కరెన్సీ ప్రకారం సుమారు 35.8 బిలియన్లతో సమానం. ఇంత సంపద అప్పట్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!) ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందిన నిజాం భారతదేశపు మొదటి విమానాశ్రయం రూపొందించినట్లు చెబుతున్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చేయడంతోపాటు విద్యుత్తును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో సహా అనేక ప్రభుత్వ సంస్థలను స్థాపించిన ఘనత కూడా నిజాం వంశానిదే అని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇతర నిజం రాజుల మాదిరిగా దుస్తులకు, ఇతరత్రా విషయాలకు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈయన వద్ద పేపర్ వెయిట్ ఉండేదని అది 185 క్యారెట్ల వజ్రాలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఘనత కూడా నిజాం రాజు సొంతమే. దానిని క్వీన్ ఎలిజబెత్ మరణించే వరకు కూడా ఉపయోగించిందని సమాచారం. -ఎన్. కుమార్ -
బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబు హయాంలో హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ.. నరనరాన భారత దేశంపై ద్వేషాన్ని, హిందువులపై కోపాన్ని నింపుకున్న వ్యక్తి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకుండా చివరివరకూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిజాంకు విశ్వాసపాత్రుడైన లాయఖ్ అలీ చివరలో ప్రాణభయంతో పాకిస్తాన్‌కు పారి పోయాడు. ఇక్కడే పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అచ్చు సినిమా ఫక్కీలో ఆయన పరారీ కథ నడిచింది. మీర్ లాయఖ్ అలీ ఓ ఇంజనీరు, పారి శ్రామిక వేత్తగా నిజాం ఆంతరంగికుల్లో ఒకడిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రజాకార్ల నేత కాసిం రజ్వీ దారుణాలకు అండదండలందిస్తూ హిందువుల ఊచకోతలను ప్రోత్సహించాడని చెబుతారు. దేశ విభజన అనంతరం అనేక కుట్రలు చేశా డనీ అంటారు. ఈయన ఎత్తుగడలకు మెచ్చే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మీర్ లాయఖ్ అలీని నిజాం నవాబు ప్రధానమంత్రిగా నియమించారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి.. నిజాం నవాబు కూడా భారత సేనల ముందు దోషిగా నిలబడక తప్పలేదు. దిల్కుషా నుంచి పరారీ.. నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించిన వెంటనే భారత సైన్యం రజాకర్ల నేత ఖాసిం రజ్వీని అరెస్టు చేసింది. హైదరాబాద్ సంస్థానం ప్రధాన మంత్రి మీర్ లాయఖ్ అలీ సహా ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. తొలుత లాయఖ్ అలీని ఆయన ఇంటిలోనే ఉంచి ఆ తర్వాత దిల్కుషా (తర్వాత ప్రభుత్వ వసతి గృహంగా మార్చారు) భవనానికి మార్చారు. అప్పటికే నిజాం రేడియో ప్రసంగం ద్వారా కాసిం రజ్వీ, లాయఖ్ అలీలను దోషులుగా తేల్చి.. స్వయంగా ప్రాసిక్యూషన్‌కు ఆదేశించారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ అయితే ఇక్కడే నిజాం దుష్టబుద్ధి చూపించుకున్నారు. లాయఖ్ అలీకి స్వయంగా నిజామే లోపాయికారిగా సహాయం చేశారని చెబుతారు. ఆయన పారిపోయేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దిల్‌కుషాకు కారును పంపారు. దీంతో లాయఖ్ అలీ బురఖా ధరించి మహిళ వేషంలో గోడదూకి ఆ కారులో బొంబాయికి పారిపోయాడు. అక్కడి నుంచి విమానంలో పాకిస్తాన్ చేరుకున్నాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా నిజాం చక్రం తిప్పారు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ పార్టీ జరుగుతోంది. అందులో పాకిస్తాన్లో భారత రాయబారి కూడా పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి, భారత రాయబారిని పరిచయం చేసుకోవటంతో ఆశ్చర్యపోవటం ఆ రాయబారి వంతైంది. తాను మీర్ లాయఖ్ అలీ అని, హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధానినంటూ ఆయన పేర్కొనటమే దీనికి కారణం. వెంటనే ఆయన భారత అధికారుల దృష్టికి ఈ విషయం తెచ్చారు. అప్పటికి గాని లాయఖ్ అలీ పారిపోయిన విషయం తెలియలేదు. 4రోజుల తర్వాత.. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ భారత్‌కు రాని లాయఖ్ అలీకి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రముఖ స్థానమిచ్చింది. తర్వాత ఆయన న్యూయార్క్‌లో స్థిరపడ్డాడు. 1971లో అక్కడే చనిపోగా ఆయన శవాన్ని సౌదీ అరేబియాలోని మదీనాలో ఖననం చేసినట్టు చరిత్ర చెబుతోంది. -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు. ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్‌కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్‌ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్‌ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్‌ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
మిగిలిన ఆ నిధులు వద్దు: ప్రిన్స్ ముఖరం
లండన్: నిజాం వారసుడు ప్రిన్స్ ముఖరం ఝా యూకేలో తమకు మిగిలి ఉన్న కొన్ని నిధులపై హక్కును కోల్పోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఒక హైకోర్టులో దీనికి సంబంధించి సాగుతున్న వ్యాజ్యం నుంచి తప్పుకోవాలని ముఖరం ఝా నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని ఒక బ్యాంక్‌లో ఉన్న నిధుల్లో తమకూ వాటా ఉందన్న ఆయన కుటుంబ సభ్యుల వాదనను బుధవారం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్ తరఫు న్యాయవాది పాల్ హ్యూవిట్ ప్రకటించారు. ఈ కేసు దాదాపు తన క్లయింట్ జీవిత కాలమంతా కొనసాగిందని, ఇకనైనా దీని నుంచి విముక్తిని ఆయన కోరుకున్నారని తెలిపారు. ఆ మిగిలిన నిధులను కుటుంబం లోని మొత్తం సభ్యులకు పంచాలని ఆయన ప్రతిపాదించారన్నారు. ఇందులో తన వారసత్వ హక్కును ఆయన కోల్పోవడానికి సిద్ధమయ్యారన్నారు. లండన్ బ్యాంక్‌లో ఉన్న సుమారు 3.5 కోట్ల పౌండ్లకు భారత ప్రభుత్వం, ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన సోదరుడు హక్కుదారులని 2019 అక్టోబర్‌లో అక్కడి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నజాఫ్ అలీ ఖాన్, హిమాయత్ అలీ మీర్జా వేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది. -
మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు..
లండన్: ఏడవ నిజాం రాజు వారసులు మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కారు. 35 మిలియన్ పౌండ్ల విషయంలో తలెత్తిన వివాదం వారిని మరోసారి కోర్టును ఆశ్రయించేలా చేసింది. గతేడాది 8 వ నిజాంకు ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఇంగ్లాండ్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా నిజాం ఎస్టేట్ కార్యనిర్వహణాధికారి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ ఏడవ నిజాంకు చెందిన 116 మంది వారసుల తరపున నజఫ్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిధులను భారతదేశానికి సరిగ్గా విడుదల చేయలేదని ఖాన్ కోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు యువరాజులు - ప్రిన్స్ ముఖరంఝా, అతని తమ్ముడు ముఫఖం ఝా దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి స్మిత్ కేసును తిరిగి తెరవడాన్ని తోసిపుచ్చారు. ‘ఆ సంపదకు వారసులెవరో తీర్పు వెలువరిచాం. కేసును తిరిగి తెరవడానికి వారికి అర్హత లేదు. దీనిని అంగీకరించడం అసాధ్యం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఏడవ నిజాం ఎస్టేట్ నిర్వాహకుడి చేత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై న్యాయస్థానం వాదనలు విననుంది. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. అసలేం జరిగిందంటే: హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 306 కోట్లకు చేరిన నిధులు.. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్ నవాజ్ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్ అకౌంట్ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు) లండన్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ రహమ తుల్లా అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్ విలీనం కావటం, ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. అయితే ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. భారత ప్రభుత్వం ఇంప్లీడ్.. ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్ కోర్టులో ఇంప్లీడ్ అయింది. దీంతో పాకిస్తాన్ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పంపారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ విషయం సమసిపోయిందకున్న సమయంలో నిజాం వారసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చదవండి: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
నిజాం‘ఖాన్’దాన్
సాక్షి, హైదరాబాద్: మీర్ ఉస్మాన్ అలీఖాన్.. ప్రపంచంలోనే ధనికుడు. హైదరాబాద్ సంస్థానాన్ని 1911 నుంచి 1948 సెప్టెంబర్ వరకు పాలించిన నిజాం రాజుల్లో చివరివాడు. ఉస్మాన్ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు.. ఆజంజా, మౌజంజా. వీరిని కాదని ఆజంజా కుమారుడు ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించాడు. హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ రహమతుల్లా ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.3.5 కోట్ల నగదు (1,007,940 పౌండ్ల 9 షిల్లాంగ్‌లు) బదిలీ అయింది. ఈ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లోనే ఉస్మాన్ అలీఖాన్ కోరినా.. పాకిస్తాన్ పేచీతో వివాదం అరవై ఏళ్లు నలిగింది. ఎట్టకేలకు లండన్ బిజినెస్ అండ్ ప్రాపర్టీ హైకోర్టు ఇటీవల 140 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఉస్మాన్ అలీఖాన్ తరఫున అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి మీర్ నవాజ్ జంగ్ జమ చేసిన నిధులకు ఆయన కొడుకులు ఆజంజా, మౌజంజా వారసులని (మనుమలు ముకర్రం జా, ముఫకం జా) తేల్చి, పాకిస్తాన్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే అప్పట్లో జమ చేసిన రూ. 3.5 కోట్లు ప్రస్తుతం రూ.306 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం వారసులకే దక్కనున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్త చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం 8వ నిజాం ముకర్రం జా ఐదవ భార్యతో ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, ముఫకం జా ఫ్రాన్స్, లండన్‌లో నివాసం ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. -
హిందూ రాజు ముస్లిం రాజ్యం
స్వాతంత్య్రానంతర పరిణామాల్లో రెండు రాచరిక పాలనల్లోని రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి. అవే హైదరాబాద్, కశ్మీర్ సంస్థానాలు. ఈ రెండు సంస్థానాల మధ్య ఒక పోలిక ఉంది. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా, రాజ్యాధికారం ముస్లింల చేతిలో ఉండేది. కశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, అధికారం హిందూ రాజు చేతిలో ఉండేది. భారత్‌లో విలీనానికి నిజాం రాజు అంగీకరించకపోవడంతో ‘ఆపరేషన్ పోలో’తో భారత్ సైన్యాన్ని దించడంతో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు రావడంతో కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకునేటప్పటికి 562 ప్రాంతాలు రాచరిక పాలనలో ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రం 1947 స్వాతంత్య్రానంతరం కూడా అదే రాచరిక వ్యవస్థలో కొనసాగాయి. కశ్మీర్, హైదరాబాద్, గుజరాత్ కతీవార్ ప్రాంతంలోని జునాగఢ్‌లు మాత్రం 1947 నాటికి భారత్‌లో భాగం కాలేదు. హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత... బ్రిటిష్ పాలన సమయంలోనే హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక సైన్యముండేది. ప్రత్యేకంగా రైల్వే, పోస్టల్ విభాగాలున్నాయి. హైదరాబాద్ సంస్థానంలో 80 శాతంగా ఉన్న హిందువులను ముస్లిం రాజు పాలించేవాడు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు 1947 జూన్ 26న హైదరాబాద్ సంస్థానం ఇటు పాకిస్తాన్‌లోకానీ, భారత్‌లో కానీ విలీనం కాబోదని ఫర్మానా జారీ చేశాడు. హైదరాబాద్ సంస్థానంపై సంపూర్ణాధిపత్యాన్ని కొనసాగించాలని భావిం చాడు. ఆయనకు టోరీ పార్టీ నాయకుడు విన్స్టన్ చర్చిల్ వెన్నుదన్నుగా నిలిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి నిజాం రాజు తేల్చుకోలేకపోవడంతో భారతప్రభుత్వం మరో రెండు నెలల సమయమిచ్చింది. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ స్వతంత్రతను ఒప్పుకునే ప్రసక్తే లేదని నిజాంని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిరంకుశ పోకడలను మానుకోవాలని నిజాం రాజును భారత సర్కార్ 1948 సెప్టెంబర్ 7న హెచ్చరించింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారత్‌లో విలీనమైంది. అదేసమయంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ సంస్థానాన్ని రాజా హరిసింగ్ పాలిస్తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దండెత్తడంతో రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. చివరకు కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది. -
50 ఏళ్ల కిందట ఇదే రోజు ఏడో నిజాం కన్నుమూత
హైదరాబాద్: నిజాం అంటేనే చాలామంది చిరాకు.. ఇంకొందరికి కోపం.. డిబేట్లకు అవకాశం ఇస్తే మైకులు పగిలిపోయేంత గట్టిగా మాట్లాడతారు. అరాచకాలు, ఆకృత్యాలు, నిరంకుశత్వం అంటూ ఇలా చెప్పుకుంటూ వెళితే చాంతాడంత. ఎంత చెడ్డవారైనా వారు చేసిన కాస్తంత మంచి పనిని గుర్తించి ఆ మంచిని తెలియజేయడమే సరైన చర్య. హైదరాబాద్ చివరి నిజాం, దాదాపు ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ చేసిన వ్యక్తి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నేడు ఆయన 50 వర్ధంతి. నిమోనియా కారణంగా కింగ్ కోటి ప్యాలెస్‌లో 1967, ఫిబ్రవరి 24 అంటే సరిగ్గా ఇదే రోజు చనిపోయాడు. అయితే, నేడు ఆయనను తలుచుకునేవారు లేరు. ఆయన కోసం నిర్మించిన మస్జిద్ ఈ జుడి అనే సమాధి కూడా పట్టించుకోకుండా మిగిలిపోయింది. ఏడో నిజాం మరుగున పడిన రాజే అనే ఇప్పటికే పలు పరిణామాలు చెప్పినా ఒకసారి ఉస్మాన్ చేసిన కొన్ని మంచి పనులు ఆయన వర్ధంతి సందర్భంగా చూస్తే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిజామ్ హాస్పిటల్(ఇప్పుడు నిమ్స్) ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్(ఇవి రెండు కూడా తాగునీటి రిజర్వాయర్లు) మూసీనదిపై నిర్మించిన నయాపూల్ వంతెన బేగంపేట విమానాశ్రయం నిజాం స్టేట్ రైల్వేస్ అజం ఆజాహి టెక్స్ టైల్ మిల్స్ వరంగల్ హైకోర్టు భవనం అసెంబ్లీ భవనం నాంపల్లి రైల్వే స్టేషన్ జూబ్లీహాల్.. ఇంకా ఇలాంటివి, చిన్నచిన్నవి చాలానే ఉన్నాయి. -
ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆస్తి భారతదేశ బడ్జెట్‌కు రెండింతలు.. సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..1937లో ఫిబ్రవరి 22న టైం మేగజైన్ కవర్‌పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే... ఆయనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్‌జాహీ వంశంలో చివరి రాజు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్‌ను పాలిస్తున్న రాజు. 1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం.. ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు. అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు. ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం.. ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే. -
ఒక అనానంద కథ
ఎవరి జీవితమూ ఎవరి చేతుల్లో ఉండదు. రాజ్యం ఎలా ఉంటుంది? అని తెలిసినా.. అలా జరిగి ఉంటే, ఇలా జరిగి ఉంటే.. అనుకోకుండా ఉండలేం కదా! ఇంగ్లిష్ వారి వీర విధేయుడు ఏడో నిజాం, భారత ప్రభుత్వంతో విలీనం కాను అని బీరాలు పోకపోతే, రజాకార్లను ప్రోత్సహించకపోతే, ఉపఖండం చరిత్ర మరో రకంగా ఉండేది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1911లో 43వ ఏట చిన్నవయసులో మరణించి ఉండకపోతే..? మీర్ ఉస్మాన్ అలీఖాన్ గద్దెనెక్కేవాడు కాదు. మీర్ అహ్మద్ మొహియుద్దీన్ ఏడో నిజాం అయ్యేవాడు. ఆ పరిస్థితుల్లోకి తొంగి చూద్దాం! ఇంటిలోని పోరు ఇంతింత కాదయా! ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఇష్టసఖి ఉజ్జల్ బేగం. ఆమె సంతానంలో తొలి ఎనిమిది మంది పురిట్లోనే చనిపోయారు. ఆరో నిజాం భార్యలలో మరొకరు మొదటి సాలార్జంగ్ మీర్ తురబ్ అలీ ఖాన్ మనుమరాలు జహిరా బేగం. ఆరో నిజాం ఆమెను రాణివాసానికి తెచ్చేసరికే గర్భవతని విస్తృతంగా చెప్పుకునేవారు. ఆమెకు 1886లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ జన్మించారు. ఆరో నిజాం ఇష్టసఖి ఉజ్జల బేగం 1907లో మొహియుద్దీన్‌కు జన్మనిచ్చారు. తన కుమారుడిని ఏడో నిజాంగా ప్రకటించాల్సిందిగా ఉజాలా బేగం భర్తను డిమాండ్ చే సేది. ‘అలాగే, మొహియుద్దీనే నా వారసుడు తొందరెందుకు’ అని ఆయన సముదాయించేవాడు. ఒక రోజు వారసత్వ ప్రకటన చేయవలసినదిగా ఉజ్జల బేగం భర్తను ఆరడిపెట్టింది. కైకను గుర్తు చేస్తూ ‘ఆజీచ్, అభీచ్’ (ఈరోజే, ఇప్పుడే) అన్నది! మెహబూబ్ అలీఖాన్ కోపావేశంతో విసురుగా పురానాహవేలీ నుంచి బయటకు వచ్చాడు. కారు యాక్సిలేటర్ మట్టానికి తొక్కి ఫలక్‌నుమా చేరాడు. చిత్తుచిత్తుగా తాగాడు. మూడు రోజులు, వరుసగా! సోయి తప్పిన మహబూబ్ అలీఖాన్ కోమాలోకి వెళ్లాడు. 1911 ఆగస్ట్ 29 మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగిరానిలోకాలకు చేరాడు. ‘రాయల్’ పాలన! మహబూబ్ అలీఖాన్ తన బాధను ప్రజల బాధ చేయలేదు. ప్రజల సౌఖ్యాన్ని తన సౌఖ్యంగా భావించాడు. తెల్లవారుజామున మారువేషంలో సామాన్యులతో మిళితయమ్యేవాడు. ఇరానీచాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టి పాలనపై ఫస్ట్‌హ్యాండ్ రిపోర్ట్ తీసుకునేవాడు. దేశంలో తొలిసారిగా ఎడ్వర్డ్ లారీ తదితరులతో హైదరాబాద్ క్లోరోఫాం కమిషన్ ఏర్పాటు చేశాడు. 1908 సెప్టెంబర్ 28న మూసీ వరదలు సందర్భంగా రాజప్రాసాదాలన్నిటినీ వరదబాధితుల శిబిరాలుగా మార్చాడు. గంగమ్మకు మొక్కాడు. ఇప్పటికీ తన హోదాను కోల్పోని నిజాం క్లబ్‌ను స్థాపించాడు. తన 40వ పుట్టినరోజు సందర్భంగా టౌన్‌హాల్ (ప్రస్తుత శాసన సభ)కు శంకుస్థాపన చేశాడు. అతని హయాంలోనే హైదరాబాద్ స్టేట్ రైల్వే, విద్యుత్,పోస్టల్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ సదుపాయాలు ఏర్పడ్డాయి. సైన్యాన్ని బలోపేతం చేశాడు. చార్మినార్ ముద్రతో నాణేలు వచ్చాయి. ఆలియా, మహబూబియా కళాశాలలు, అనేక బాల-బాలికల విద్యాసంస్థలూ వచ్చాయి. మహబూబ్ అలీ ఖాన్ కెమెరా ప్రేమికుడు. రాయల్ సొసైటీ ఆశ్చర్యపోయే రీతిలో ఫొటోగ్రఫీ ప్రపంచంలో హైదరాబాద్‌ను నిలిపాడు. అతడు లేని శూన్యంలో వారసత్వ గొడవలొచ్చాయి. వారసత్వ విభేదాలు ? ఆరో నిజాం జీవించి ఉంటే నిస్సంశయంగా మీర్ అహ్మద్ మొహియుద్దీన్ ఏడో నిజాం అయ్యేవాడు. ఆయన పోవడంతో తర్వాత రాజు ఎవరు కావాలి ? రాజవంశీకుల్లో భిన్నాభిప్రాయాలు! ఉజ్జల బేగం నాలుగేళ్ల కుమారుడు మొహియుద్దీనా? జహిరా బేగం కుమారుడు 25 ఏళ్ల మీర్ ఉస్మాన్ అలీఖానా? మొహియుద్దీన్‌కే గద్దె దక్కాలని చాలా మంది భావించారు. వైస్రాయికి విన్నపాలు పంపారు. అర్జీలో మహరాజా కిషన్ ప్రసాద్ సంతకం ఫోర్జరీ చేశారు. వైస్రాయిని ‘కన్విన్స్’ చేసిన ఉస్మాన్ అలీఖాన్ ఏడో నిజాం అయ్యాడు. తనకు వ్యతిరేకంగా అర్జీపెట్టిన ‘కుట్ర’దారుల్లో ఆరో నిజాం స్నేహితుడు, ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్ ఉన్నారని భావించి ఆయనను పదవి నుంచి తొలగించారు. ‘మహారాజా’ కిషన్‌ప్రసాద్ ప్రభువు ఎవరైతే వారి కుడిభుజంగా వ్యవహరించే నిబద్ధుడని, దోషరహితుడని పాతికేళ్ల తర్వాత నిర్థారించుకుని మీర్ ఉస్మాన్ ఖాన్ కిషన్ ప్రసాద్‌ను ప్రధానిగా ఆహ్వానించారు. రాకుమారుడి పట్ల నిజాం ప్రవర్తన! ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం కింగ్‌కోఠి. తన సవతి తల్లి ఉజ్జలబేగంను ఆమె నాలుగేళ్ల కుమారుడు మొహియుద్దీన్ను, ఆయన చెల్లెలు అహ్మదున్నీసాలను కింగ్‌కోఠి ప్రాంగణంలోని భవంతిలో నివసించాలని కోరాడు. ఆ కుటుంబంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవాడు. మొహియుద్దీన్‌కు ‘సలబత్ జా’ బిరుదును ఖారారు చేసి రాకుమారుని హోదా ఇచ్చారు. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. సందర్శకులపై నిఘా ఉండేది. ఉత్తరాలు సెన్సార్ అయ్యేవి. సలబత్ జా యువకుడయ్యాడు. తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు. కవి, ప్రేమికుడు. తనకంటే పదకొండేళ్లు చిన్నదైన లయెలా విలింకర్ అనే బెంగాలీ యువతిని ప్రేమించాడు. పెండ్లాడాలనుకున్నాడు. నిజాం పొసగనివ్వలేదు. అలగడం తప్ప మరేమీ చేయగలడు? యూరప్ వెళ్లాడు. మూడో సాలార్జంగ్ (మ్యూజియం రూపకర్త) ఆమెను ప్రేమించాడు. పెళ్లాడతానంటున్నాడు. ఆ సంగతే లయెలా విలింకర్ ఉత్తరం రాసింది. సలబత్ జా మర్యాదస్తుడు. ‘బాధ పడకు నేను వివాహానికి కవితను కానుకగా పంపుతాన’ని బదులిచ్చాడు. మూడో సాలార్జంగ్ అవివాహితుడుగానే మరణించాడు. అంతర్ముఖుడైన సలబత్ జాకు మొగల్ కుటుంబానికి చెందిన అగా హసన్ హైదర్ మీర్జాతో స్నేహం ఏర్పడింది. ఉస్మాన్ అలీ ఈ స్నేహాన్నీ హర్షించ లేదు. ఇరువురూ ఉత్తరాల్లో హృదయాన్ని విప్పుకునేవారు. చిన్నవయసులోనే అజ్ఞాత కారణాలతో సలబత్ జా మరణించాడు. మీర్జా మరణం తర్వాత, అతని కుమార్తె మెహరున్నీసా హుసేన్ 76 ఉత్తరాలను సంకలనంగా (THE UNHAPPY PRINCE Nashad Asifi Selected Letters Of Prince Salabat Jah Of Hyderabad To Aga Hyder Hasan Mirza) ప్రచురించింది. ఈ ఉత్తరాలు సలబత్ జా స్వభావచిత్రణ చేస్తాయి. ఆయన వినయశీలి. కవి, గాయకుడు. ‘మధు’పాయి! ఆనందం లేని తన జీవితాన్ని సంకేతిస్తూ ‘న-షాద్ అసిఫీ’ (అనానంద అసఫ్‌జా) అనే కలం పేరుతో కవిత్వం రాశాడు. తండ్రిని కోల్పోయిన సలబత్ జా ఒక్కడేనా అనానందుడు? కాదు, హైదరాబాద్ స్టేట్‌పైనే కాదు ఉపఖండంపై, నా వంటి అసంఖ్యాకులపై ఆ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సాయుధ పోరాటం ఉద్భవించింది. రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌడ్ వంటి అరుణతారలను ‘అనానంద హైదరాబాద్’ కన్నది! -
బన్ను పోయి బిస్కట్
బన్ను... ఉదయం చాయ్‌తోపాటు తినటం ప్రజల అలవాటు. దైనందిన జీవనంలో దీనిది విడదీయరాని బంధం. అయితే ఇది 1920కి ముందు ఉన్న పరిస్థితి. అప్పుడే నగరంలో కాలుమోపింది మరో పదార్థం. చూస్తుండగానే బన్ను కనుమరుగై ఆ కొత్త పదార్థం మన ఇరానీ చాయ్‌కి సరిజోడీ అయింది. దానితో పాటు ఆస్వాదిస్తేనే ఇరానీ చాయ్ రుచికి ఓ అర్థం ఉంటుందనేంతగా సగటు హైదరాబాదీని మెప్పించింది. అదే ఉస్మానియా బిస్కట్..! ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం ప్రపంచ పటంలో ప్రత్యేకతను సంతరించుకోవాలని కలలుగన్నాడు. ఆ కలలను సాకారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అన్నింటా ముందు నిలిపాడు. విద్యుదీకరణ, రైల్వే, రోడ్డు, విమాన సర్వీసుల అభివృద్ధి, అసెంబ్లీ, జూబ్లీహాలు, హైకోర్టు భవనం, స్టేట్ మ్యూజియం, నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియూ యూనివర్సిటీ... ఇలా భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంటూ ప్రగతి దిశగా పరుగులెత్తింది. దీనికితోడు తన అభి‘రుచు’లు పదికాలాల పాటు నిలిచిపోయేలా కూడా చొరవచూపాడు. అలా పుట్టిందే ఉస్మానియూ బిస్కట్. 1920 నాటికి హైదరాబాద్‌లో బన్ను (డబల్రోటీ)దే హవా. అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఇరాన్ చాయ్‌తోపాటు బన్ను తినటం ఉన్నత వర్గం అలవాటు. ఇరానీచాయ్ లేనిదే నిజాంకు కూడా పూటగడవదు. ఓరోజు చాయ్‌తోపాటు ఆయన మైదా పిండితో రూపొందించిన పదార్థం రుచి చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. ఇక నాటి నుంచి చాయ్‌తో పాటు దాన్ని ఆరగించటం ప్రారంభించారు. క్రమంగా అది దివానం దాటి గల్లీలకూ పాకింది. ఆయన నాంది పలికిన అలవాటు కావటంతో ఆ పదార్థానికి ఆయన పేరే దక్కింది. అదే ఉస్మానియూ బిస్కట్..! సిటీలోని కేఫ్‌లో ఓ మూల కూర్చుని చాయ్ తాగుతూ బిస్కట్లను లాగిస్తుంటే సమయం తెలియదు. ఆలోచనలకు పదునుపెడుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, బద్ధకాన్ని వదిలిస్తుంది, పనిలో వేగాన్ని కలిగిస్తుంది, స్నేహాన్ని పెంచుతుంది... అంటూ యువత కితాబిస్తున్న ఆ కవల జంట కాంబినేషనే... ఇరానీ చాయ్ ఉస్మానియూ బిస్కట్. హైదరాబాద్‌లో పుట్టిన ఈ బిస్కట్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు. ఉస్మానియా బిస్కట్ పేరుతోనే అమెరికా, బ్రిటన్‌లలోనూ అది హల్చల్ చేస్తోంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఎడారి దేశాల్లో దాని హవా చెప్పనే అక్కర్లేదు. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లకు ఏమాత్రం తీసిపోని కీర్తిని ఇది సొంతం చేసుకుంది. బట్టీలో భలేగా సిద్ధం... ఉస్మానియూ బిస్కట్ రుచిలోని మజాయే వేరు. కాసేపు తీయగా, ఆ వెంటనే ఉప్పగా, ఇంతలో కమ్మగా... వెరసి గ‘మ్మత్తు’గా ఉంటుంది. ముందు గట్టిగా అనిపించినా టీలో నంజుకుని నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. గుండ్రగా, మందంగా, వెనకవైపు కాస్త మాడినట్టుగా కనిపించే ఉస్మానియూ బిస్కట్లు బట్టీల్లో సిద్ధమవుతారుు. వీటి తయూరీకి మూల పదార్థం మైదాపిండి. ఇందులో చక్కెర, ఉప్పు, కాస్త నెరుు్య, పాల పొడి, కస్టర్డ్ పొడిని కలిపి బిళ్లలుగా చేసి బట్టీలో నిప్పుల వేడిపై కాలుస్తారు. ప్రతి బేకరీలో వీటిని తయూరు చేస్తున్నారు. నిత్యం లక్షల్లో ఇవి స్వాహా అవుతుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేకరీల్లో వీటి తయూరీపైనే దృష్టి సారిస్తుంటారు. -
బెల్లవిస్టా... చరిత్రకు సాక్షి
హైదరాబాబాద్ మా కలల నగరం! ఇక్కడికి వస్తామని కలలు కనలేదు! ఇది మామూలు నగరమా? రెండు బిలియన్ డాలర్ల స్వంత ఆస్తితో ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ జీవించిన నగరం! ఎర్రని ఉదయం కోసం మగ్దుం వంటి విప్లవ కవులు కామ్రేడ్లూ ఉద్యమించిన నగరం! మానాన్న వయసున్న పెద్దవాళ్లు ఇక్కడి స్త్రీల సౌందర్యాలను మార్మికంగా వర్ణించుకునే వారు! ప్రిన్సెస్ నీలోఫర్ జీవించిన నగరం! హైద్రాబాద్‌ను ‘నగరాల్లో వధువు’గా ఉర్దూ కవులు అభివర్ణించారు. 1958లో మేము ఇక్కడకు వచ్చేసరికి ‘నిరుడు కురిసిన హిమసమూహములు’ కరిగిపోయినా, ఆ చల్లదనం, ఆహ్లాదం ఆవిరి కాలేదు! విశాలమైన, నీటైన సిమెంట్ రోడ్లు. ఒకే అంతస్తున్న ఇళ్లు. ఎటుచూసినా పచ్చదనం. రాజ్యం పోయినా దర్పమూ, ఔదార్యమూ లోపించని రాజవంశీకులు ! నగరంలో తొలకరి వర్షం ప్రతిఏటా జూన్ 7న పడేది. ఏ ఏడాదైనా అలా వాన కురవకపోతే, ఒకటి రెండురోజులు ఆలస్యమైతే ప్రతి హైద్రాబాదీ బాధపడేవారు. ‘ప్చ్, అయ్యో, వాన కురవలేదు ఎందుకనో’ అంటూ తనవల్లే వాన కురవలేదా అన్నంతగా ఫీలయ్యేవారు. తొలకరితో నగరం చల్లబడేది. మరో తొమ్మిది నెలలవరకూ! కుదుపుల్లేని ప్రయాణంలా రుతువులు మెల్లమెల్లగా మారేవి. వానాకాలం నుంచి చలికాలం రావడం దుస్తుల మార్పులో స్పష్టంగా తెలిసేది. ఇక్కడి హాయైన వాతావరణం ప్రజలకు సామరస్య స్వభావాన్నిచ్చిందేమో! ఈ వాతావరణం ఆదర్శనీయమైన గవర్నర్లనూ ఇచ్చింది! సరోజినీ నాయుడు నుంచి శివశంకర్ వరకూ ఎక్కువమందిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపింది హైద్రాబాదే! శతాధిక వసంతాల భవనం! జిల్లాల్లో ట్రైనీలుగా పనిచేస్తూ శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు 1956లో హైద్రాబాద్ వచ్చేవారం. రాజ్‌భవన్-పంజాగుట్ట జంక్షన్లో ఉన్న బెల్లావిస్టా అతిథి భవనంలో మా విడిది. బెల్లవిస్టా అనే ఇటాలియన్ పేరుకు అర్థం ‘అందమైన చోటు’! ఇక్కడ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉంది. అతిథి గృహంలో ఫర్నిచర్, పింగాణీ, వెండి పాత్రలూ, సేవకుల వినయవిధేయతలూ మమ్ములను ఆశ్చర్యానికి గురిచేసేవి. ‘రాజరికం’ మా అనుభవంలోకి వచ్చేది! ఈ అందమైన చోటు శతవసంతాలు చూసింది. హైద్రాబాద్ హైకోర్డు ప్రధానన్యాయమూర్తి ముస్లిహుద్దీన్ మహమ్మద్ 1905లో బెల్లావిస్టా భవంతిని నిర్మించారు. ఆయనకు హకీముద్దౌలా బిరుదుండేది. విశాలమైన ఆ భవంతిలో రెండు అడుగుల గోడలు తప్ప మధ్యలో ఎక్కడా స్తంభాలుండేవి కావు. 57వ ఏట ప్లేగు వ్యాధితో మరణించే వరకూ(1914) ఆయన అందులో నివసించారు. ఈ కాం పౌండ్లోనే ఇంకో భవంతి ఉంది. ఇందులో హకీముద్దౌలా తమ్ముడు న్యాయవాది, జలాలుద్దీన్ నివసించేవాడు. 1916లో ఆయన చనిపోయిన తర్వాత వారసులు అమ్మకానికి పెట్టారు. 1917లో ఫర్నిచర్‌తో సహా 60 వేల రూపాయలకు నిజాం కొన్నాడు. క ట్టుబడి ఖర్చు రూ.45 వేలు! రాకుమారుని ‘కటకట’! నిజాంకు ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ అలీ ఇమామ్ 1919నుంచి 1922 వరకూ బెల్లవిస్టాలో నివసించారు. పక్కనే ఉన్న లేక్‌వ్యూ (ప్రస్తుతం ఎ.పి.సీ.ఎం క్యాంప్ ఆఫీస్) అలీ ఇమామ్ కార్యాలయం! సాయుధ దళాల అధిపతి, బేరార్ యువరాజు హోదాలో నిజాం పెద్దకుమారుడు అజంజా, 1922 నుంచి ఇందులో నివసించారు. బెల్లవిస్టా ముందు ఇప్పుడు విద్యుత్ కార్యాలయం ఉన్న భవంతి యువరాజుల గుర్రపుశాల! బెల్లవిస్టాలో ఆయన నివసించినన్నాళ్లూ రాత్రి విందు వినోదాలు పూర్తయ్యి నిద్రలోకి జారేవేళకి సూర్యుడు ఉదయిస్తుండేవాడు! యువరాజుకి నెలకు 25వేలు అలవెన్స్‌గా నిజాం ఇచ్చేవాడు. అది చాలక వడ్డీవ్యాపారుల వద్ద ముప్ఫై వేలు తీసుకున్నట్లుగా సంతకాలు పెట్టి పదివేల రూపాయలు తీసుకునేవాడు. పెద్ద-చిన్న ప్రిన్స్‌లు (అజంజా-మౌజాం జా) ఇలా చేసిన అప్పు మొత్తం నాలుగున్నరకోట్ల రూపాయలుగా లెక్కతేలింది. నిజాం క్లియర్ చేశాడు. ఇక్కడ రకరకాల స్త్రీ-పురుషులుండేవారు! వారందరినీ ఖాళీచేయాల్సిందిగా ఆదేశించి వారి తాలూకూ బాకీలు లెక్కవేసేందుకు నిజాం ఒక కమిటీ వేశాడు! తనకు 50 ఏళ్లు వచ్చినా ఆయన విదిల్చే ‘నాలుగు కాసుల కోసం’ ఎదురు చూడాల్సి వస్తోందని బేరార్ యువరాజు, నిజాంకు వ్యతిరేకంగా క్షుద్రపూజలు చేయించాడు! ఇవన్నీ తెలిసి నిజాం వార సుడిగా మనుమడు ముఖరంజాను నిర్ణయించాడు. ఫలితంగా తండ్రికొడుకుల మధ్య మాటలు లేవు! 1948లో హైద్రాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో భాగం అయ్యాక ‘నిజాం సైన్యాధ్యక్షుడు’ బెల్లవిస్టాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి బెల్లవిస్టా ప్రభుత్వ అతిథి గృహం. ట్రైనీ ఆఫీసర్లుగా మేం విడిది చేసినప్పుడు అక్కడి లైబ్రరీలో అపురూప గ్రంథాలను తిరగేశాం! ‘నిజాం సిబ్బంది’ చెప్పే బెల్లావిస్టా కథలు ఏ పుస్తకంలోనూ ఉండేవి కావు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
నిజాం సొమ్ము కోసం 'పాక్' లాట
సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచిన సొమ్ముపై ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌ల మధ్య న్యాయపోరాటం సాగుతోంది. ఆ బ్యాంకులోని నిజాం నవాబు అకౌంటు నుంచి 1947-48 ప్రాంతంలో అప్పటి పాకిస్థాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీముతుల్లా అకౌంట్లోకి భారీ మొత్తంలో డబ్బు లు బదిలీ అయ్యాయి. నిజాం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రే అక్రమంగా ఆ డబ్బుల్ని బదిలీ చేశారు. ఆ విషయం తెలిసి దాన్ని తక్షణం నిలిపివేయాలని కోరుతూ లండన్ కోర్టులో నిజాం స్టే పొందారు. 1967లో నిజాం మృతి చెందారు. ఆ తరువాత స్టేను తొలగించి సొమ్మును కైవసం చేసుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మొత్తం భారీగా ఉండటంతో భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. మొదట న్యాయస్థానం బయట చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించి, అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ లోపు పాకిస్థాన్ ప్రభుత్వం వెస్ట్మినిస్టర్బ్యాంకులోని మొత్తం సొమ్మును తమకు బదలాయించాలంటూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో భారత ప్రభుత్వం కూడా న్యాయపోరాటం ప్రారంభించింది. ఇందులో భాగంగా వెస్ట్‌మినిస్టర్ బ్యాంకులో నిజాం డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర ఆస్తులకు చెందిన వివరాలను, నిజాం డబ్బులు, ఆస్తులపై గతంలో వివిధ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను వెంటనే ఢిల్లీకి పంపాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర అధికారులు ఆ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి, 1957 సంవత్సరంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెస్ట్‌మినిస్టర్ బ్యాంకులో నిజాం దాచిన డబ్బుల విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చారు.