మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు.. | Hyderabad Nizam's Descendants Back In UK Court Over 35 Million Pounds | Sakshi
Sakshi News home page

మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు

Jul 23 2020 10:23 AM | Updated on Jul 23 2020 3:03 PM

Hyderabad Nizam's Descendants Back In UK Court Over 35 Million Pounds - Sakshi

నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

లండన్‌: ఏడవ నిజాం రాజు వారసులు మరోసారి లండన్‌ కోర్టు మెట్లెక్కారు. 35 మిలియన్‌ పౌండ్ల విషయంలో తలెత్తిన వివాదం వారిని మరోసారి కోర్టును ఆశ్రయించేలా చేసింది. గతేడాది 8 వ నిజాంకు  ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఇంగ్లాండ్‌ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా నిజాం ఎస్టేట్‌ కార్యనిర్వహణాధికారి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ ఏడవ నిజాంకు చెందిన 116 మంది వారసుల తరపున నజఫ్‌ అలీఖాన్‌ కోర్టును ఆశ్రయించారు.

ఈ నిధులను భారతదేశానికి సరిగ్గా విడుదల చేయలేదని ఖాన్‌ కోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు యువరాజులు - ప్రిన్స్ ముఖరంఝా, అతని తమ్ముడు ముఫఖం ఝా దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి స్మిత్‌  కేసును తిరిగి తెరవడాన్ని తోసిపుచ్చారు. ‘ఆ సంపదకు వారసులెవరో తీర్పు వెలువరిచాం. కేసును తిరిగి తెరవడానికి వారికి అర్హత లేదు. దీనిని అంగీకరించడం అసాధ్యం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ  ఏడవ నిజాం ఎస్టేట్ నిర్వాహకుడి చేత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై న్యాయస్థానం వాదనలు విననుంది. 

ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్‌ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు.  
ముఫకంజ: భార్య ఏసెస్‌(టర్కీ), పిల్లలు: రఫత్‌ జా, ఫర్హత్‌ జా 
వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే: 
హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1948లో 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్‌ (సుమారు ఒక మిలియన్‌ పౌండ్లు)లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్‌ హైకమిషనర్ హబీబ్‌ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్‌ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 
306 కోట్లకు చేరిన నిధులు..  
హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్‌ నవాజ్‌ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ అకౌంట్‌ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్‌లు) లండన్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ రహమ తుల్లా అకౌంట్‌లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్‌ విలీనం కావటం, ఉస్మాన్‌ అలీఖాన్‌ రాజ్‌ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. 

అయితే ఆ నిధులు తమవేనని పాకిస్తాన్‌ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్‌ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్‌ చేసిన వాదనను జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు.

భారత ప్రభుత్వం ఇంప్లీడ్‌.. 
ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్‌ కోర్టులో ఇంప్లీడ్‌ అయింది. దీంతో పాకిస్తాన్‌ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్‌ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పంపారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది.  అయితే  ఈ విషయం సమసిపోయిందకున్న సమయంలో  నిజాం వారసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.  చదవండి: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement