Usman Ali Khan
-
నిరుపేదల నెత్తురులో ఎన్ని విప్లవాలో!
నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయన్ని ప్రశ్నించటం అంటే ప్రాణాలకు తెగించడమే. దాశరథి కృష్ణమాచార్యులు చేసింది అదే! నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలనూ, ఆకలి కేకలనూ చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగు సైరన్ ఊదారు దాశరథి. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బంధిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ కవితలు లిఖించారు. దాశరథి శతజయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆయన రచించిన ‘అగ్నిధార’ కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలూ, చారిత్రక వాస్తవాలూ పరిశీలించడం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది.‘ఇది నిదాఘము; ఇందు సహింపరాని/ వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ/ వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/జ్యము లున్నవో! యని యరసినాను;/ నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను’ అని ఇందూరు జైలులో (నిజామాబాద్) బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతు చించుకొని అరిచారు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ– సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు ‘‘బందీని’’ చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే... ‘వెన్నెలలు లేవు, పున్నమ కన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’ అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓసి కూలిదానా! అరుణోదయాన/ మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని/యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు/ ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?’ అంటూ రాసిన కవితా పాదాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీని చూసి చలించి వ్రాసిన ‘ఉస్సురనెదవు’ కవితలోనివి. ‘అనాదిగా సాగుతోంది/ అనంత సంగ్రామం/ అనాథుడికి, ఆగర్భ/ శ్రీనాథుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు/ భూమి లేదు, పుట్రలేదు/ రైతుల రక్తం త్రాగే/ జమీందార్ల కేస్టేట్లు’ అంటారు ‘అనంత సంగ్రామం’ కవితలో! యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా ‘సంగ్రామం’ జరుగుతుంది మరి! ‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ కదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను/ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి/ ఇళ్ళన్నీ కొల్లగొట్టి/ తల్లి పిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ దిగిపోవోయ్ తెగిపోవోయ్ / తెగిపోవోయ్ దిగిపోవోయ్/ ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను’ అంటారు ‘అగ్నిధార’ కావ్యంలోని చివరి కవితలో. ఈ కవిత శ్రీశ్రీ ‘జగన్నాథుని రథ చక్రాలు’ కవితను గుర్తుకు తెస్తుంది. ‘ఇక చాలు నీ అసమర్థపాలన’ అంటూ కడిగిపారేశారు, ఈ కవితలో. కవి ఎప్పుడూ పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి. అన్నార్థుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. అచ్చంగా అదే చేశారు దాశరథి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ‘అగ్నిధార’ కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేశాయి. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది అధికారికంగా!– డా‘‘ మహ్మద్ హసన్తెలుగు సహాయాచార్యులు, నల్గొండ99080 59234(రేపు దాశరథి శతజయంతి ప్రారంభం) -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్‌తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్‌కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్‌కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు..
లండన్: ఏడవ నిజాం రాజు వారసులు మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కారు. 35 మిలియన్ పౌండ్ల విషయంలో తలెత్తిన వివాదం వారిని మరోసారి కోర్టును ఆశ్రయించేలా చేసింది. గతేడాది 8 వ నిజాంకు ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఇంగ్లాండ్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా నిజాం ఎస్టేట్ కార్యనిర్వహణాధికారి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ ఏడవ నిజాంకు చెందిన 116 మంది వారసుల తరపున నజఫ్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిధులను భారతదేశానికి సరిగ్గా విడుదల చేయలేదని ఖాన్ కోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు యువరాజులు - ప్రిన్స్ ముఖరంఝా, అతని తమ్ముడు ముఫఖం ఝా దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి స్మిత్ కేసును తిరిగి తెరవడాన్ని తోసిపుచ్చారు. ‘ఆ సంపదకు వారసులెవరో తీర్పు వెలువరిచాం. కేసును తిరిగి తెరవడానికి వారికి అర్హత లేదు. దీనిని అంగీకరించడం అసాధ్యం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఏడవ నిజాం ఎస్టేట్ నిర్వాహకుడి చేత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై న్యాయస్థానం వాదనలు విననుంది. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. అసలేం జరిగిందంటే: హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 306 కోట్లకు చేరిన నిధులు.. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్ నవాజ్ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్ అకౌంట్ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు) లండన్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ రహమ తుల్లా అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్ విలీనం కావటం, ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. అయితే ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. భారత ప్రభుత్వం ఇంప్లీడ్.. ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్ కోర్టులో ఇంప్లీడ్ అయింది. దీంతో పాకిస్తాన్ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పంపారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ విషయం సమసిపోయిందకున్న సమయంలో నిజాం వారసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చదవండి: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు -
మాట ముచ్చట C\O హైదరాబాద్ హౌస్
హైదరాబాద్ హౌస్..దేశానికి విదేశీ దేశాధినేతలు వచ్చినప్పుడల్లా ప్రపంచానికి ఈ పేరు వినిపిస్తుంది. ప్రముఖులు రావడం కంటే వారితో మన దేశం చర్చలు జరిపి చేసుకొనే ఒప్పందాలపైనే ప్రపంచ దృష్టి నిలుస్తుంది. ఆ ఒప్పందాలతోపాటే మార్మోగే పేరు హైదరాబాద్ హౌస్. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌తో కీలక ఒప్పందాలకు, ద్వైపాక్షిక చర్చలకు కూడా ఈ భవనమే వేదికై అంతర్జాతీయంగా మరోసారి వెలుగు వెలిగింది.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) ఇంతకూ ఆ భవనమే ఎందుకు? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీతో కలసి ఓ ఊయలలో కూర్చొని కాసేపు మాట్లాడారు. రెండోసారి ఆయన.. మ హాబలిపురంలో సముద్ర తీరాన కొబ్బరి బొండాలను ఆస్వాదిస్తూ చర్చించుకున్నారు. అవ న్నీ సరదా చర్చలకే పరిమితం. అసలు సిసలు చర్చలంటే చలో హైదరాబాద్ హౌస్ అనాల్సిందే. రెండు దేశాల మధ్య ఒప్పందాలు అనగానే వాటిని ఫలప్రదం చేసే స్థాయిలో చర్చలు జరగాలి. ఆ చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రాంగణం ఉండాలి. అది అబ్బురపరిచే రీతిలో ఠీవిగా ఉండాలి. వాటన్నింటికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ హౌసే. ఎందుకంటే ఆ నిర్మాణ కౌశలం గంభీరంగా ఉంటుంది, అందులోని ఇంటీరియర్ రాజసా న్ని ఒలకబోస్తుంది. పచ్చికబయళ్లు గంభీరవా తావరణాన్ని తేలికపరుస్తాయి. ప్రవేశమార్గంలో వాడిన రాతి నగిషీలు మొదలు, భవనంపై న ఉన్న గుమ్మటం శిఖరం వరకు అన్నీ ప్రత్యేకమే, అందుకే ఆ భవనం ఢిల్లీలో ఓ ప్రత్యేకం. (నమస్తే ట్రంప్ అదిరింది... ) నిజాం ప్యాలెస్ సే హైదరాబాద్ హౌస్ తక్ ప్రపంచ ధనవంతుడిగా వెలుగొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏది చేసినా తన స్థాయికి తగ్గట్టే ఉండాలని కోరుకున్నాడు. దానికి అప్పట్లోనే హైదరాబాద్‌కు ఒనగూరిన హంగులే సాక్ష్యం. రాచరికంలో కనిపించిన ఆ ర్భాటాన్ని అమితంగా ఇష్టపడే ఆయన కలకు సజీవ సాక్ష్యమే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. విదేశాల నుంచి వస్తువులు.. దేశ రాజధానిలో తమకు ఓ విడిది ఉండాలనే ది అప్పటి సంస్థానాధీశుల కోరిక. అందుకు నాటి ఆంగ్ల పాలకులు అంగీకరించారు. అంతే స్థలాలు సమకూర్చుకొని భారీ ప్యాలెస్‌లు ని ర్మించుకున్నారు. ఢిల్లీ అనగానే మన మదిలో మెదిలేది ఇండియా గేట్. ఔరా అనిపించేలా వెలుగొందుతున్న రాష్ట్రపతి భవన్. ఈ రెండు నిర్మాణాలను రూపొందించింది ఒక్కరే. ఆయనే ఎడ్విన్ లూటెన్స్. ఆంగ్లేయుల కాలంలో విఖ్యాత ఆర్కిటెక్ట్. నాటి వైస్రాయ్ అధికారిక నివాసం కోసం అద్భుతంగా రూపొందించిన భవనం అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప ప్యాలె స్‌గా అలరారింది. దాన్ని చూడగానే ఢిల్లీలోని తన అధికారిక నివాసం అలాగే ఉండాలన్న ఉ ద్దేశంతో ఎడ్విన్‌కు దాని ప్రణాళిక బాధ్యతలు అప్పగించాడు ఏడో నిజాం. ఇంకేముంది.. ఫర్నిచర్ కోసం కలప, ఫ్లోరింగ్ కోసం రాళ్లు విదేశాల నుంచి చకచకా వచ్చేశాయి. 1926లో నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లలో పూర్తి చేశా రు. 8.77 ఎకరాల విస్తీర్ణంలో 36 గదులతో కూడిన ఈ భవన నిర్మాణానికి రూ. 1.86 కో ట్లు ఖర్చయ్యాయి. తొలుత నిజాం ప్యాలెస్‌గా పేరొందిన ఈ భవనం స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ హౌస్‌గా మారింది. కొడుకులకు నచ్చలేదు.... నిజాం జీవన విధానం పూర్తి ఇస్లాం పద్ధతిలో ఉండేది. మతానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వారసులనూ అలానే పెంచా రు. ఆయన కుమారులు అంతకంటే ఎక్కువ గా మతానికి ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ హౌస్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలకు కూడా అదే కారణమైంది. రాజప్రాసాదంలా ఉండాలన్న ఉద్దేశం తో హైదరాబాద్ హౌస్‌కు ఆయన ఆర్కిటెక్ట్‌గా నియమించుకున్న ఎడ్విన్‌కు నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పటికే సిద్ధమైన వైస్రాయ్ భవనంపై ఉండే గుమ్మటం (డోమ్) సాంచీలో ఉండే బౌద్ధస్థూపం నమూనాలో నిర్మించారు. దానికి కాస్త పోలికలుంటూనే యూరోపియన్ నిర్మాణ శైలితో నియో క్లాసికల్‌గా హైదరాబాద్ హౌస్‌పై డోమ్‌ను నిర్మించారు. దీంతోపాటు మొత్తం భవనం నాటి ఆధు నిక యురోపియన్ ఆర్కిటెక్ట్ శైలితో రూపొందింది. దీన్ని చూసి దేశవిదేశీ ప్రముఖులు అద్భుతంగా ఉందని మెచ్చకున్నారు. ఈ మెచ్చుకోలుకు నిజాం పొంగిపోయాడు. కానీ ఆయ న ఇద్దరు కుమారులు అజంజాహి, మొజం జాహీ మాత్రం నొచ్చుకున్నారు. అందుకే వారు ఆ భవనంలో ఉండలేమని తేల్చి చెప్పారు. కాసేపు భవనంలో కాలక్షేపం చేసినా.. తర్వాత వాళ్లు అందులోకి రావడానికి నిరాకరించారు. నాలుగు పర్యాయాలే వచ్చిన నిజాం ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఆ అద్భుత ప్యాలెస్‌ను నిజాం సందర్శించింది మాత్రం నాలుగు పర్యాయాలేనట. 1928లో భవనం ప్రారంభానికి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ర్యాలీ మధ్య ఆయన భవనానికి చేరుకుని అందులో విడిది చేశారు. ఆ తర్వాత 1932లో కుమారులతో కలిసి వచ్చారు. స్వాతంత్య్రానంతరం ఒక పర్యాయం వచ్చారు. హైదరాబాద్ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం అయ్యాక రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించిన నిజాం 1954లో చివరిసారి హైదరాబాద్ హౌస్‌కు వచ్చారు. నెహ్రూకు హైదరాబాద్ చాయ్ తాగించిందిక్కడే నిజాం తన చివరి పర్యటనలో భాగంగా ఆ ప్యాలెస్‌కు వచ్చినప్పుడు అక్కడ భారీ ఎత్తున గార్డెన్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నాటి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారికి ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ చాయ్ తాగించారు. ప్యాలెస్ ముందు పచ్చికబయళ్లలో అటూఇటూ కలియతిరుగుతూ నెహ్రూ చాయ్‌ను ఆస్వాదించారని చెబుతారు. ఇప్పుడు అదే ప్రధాన ఆతిథ్య విడిది విదేశీ ప్రముఖులు వస్తే చాలు ద్వైపాక్షిక చర్చలు, ఉమ్మడి విలేకరుల సమావేశాలు, సదస్సులు, స మావేశాలు..ఇలా అన్నింటికీ ఇప్పు డు హైదరాబాద్ హౌసే వేదిక. మోదీ ప్రధాని అయ్యాక భారత్‌కు విదేశీ దేశాధినేతల రాక బాగా పెరిగింది. దాంతోపాటు హైదరాబాద్ హౌస్‌లో సందడి కూడా అధికమైంది. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిహారిక-ఐరిష్ మధ్య నజ్రీభాగ్!
సాక్షి, హైదరాబాద్ : నిజాం వైభవానికి ప్రతీకైన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం ప్రస్తుతం వివాదంలో పడింది. ఈ భవనానికి జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిని కొనుగోలు చేసింది. ఆపై దీని యాజమాన్య హక్కులు కాశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయ్యాయి. తమ మాజీ ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లతో ఈ విక్రయం చేపట్టారంటూ నిహారిక సంస్థ ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఈఓడబ్ల్యూ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మూడేళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్ కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగత నివాసంగా ఉండేది. ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే ఈ నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక దాంట్లో నిజాం ట్రస్ట్, మరో దాంట్లో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ పొజిషన్ తీసుకోలేదు. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య స్పర్థలు రావడంతో గత జూన్‌లో సదరు సంస్థ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ సందర్భంగా నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కాశ్మీర్‌కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించిన వీరు దీనిపై ఆరా తీయగా గత ఫిబ్రవరిలో ‘నిహారిక’ నుంచి బయటికి వచ్చిన హైదరాబాద్ వాసి సుందరమ్ కె.రవీంద్రన్తో పాటు సురేష్ కుమార్ తదితరుల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారికతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీరు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు ప్యాలెన్‌ను విక్రయించినట్లు గుర్తించి ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేయగా, ఆ శాఖకు చెందిన యూనిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా రవీంద్రన్తో పాటు, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే వారు అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలకు పారిపోకుండా కట్టడి చేసేందుకుగాను లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ) జారీ చేసింది. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్ ఉస్మాన్, ముఖేష్ గుప్తలను సైతం నిందితుల జాబితాలో చేర్చింది. గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఈఓడబ్ల్యూ అధికారులు రవీంద్రన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఐరిష్ సంస్థకు నజ్రీభాగ్‌ను విక్రయిస్తూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో సురేష్, రవీంద్రన్లే సంతకాలు చేశారని, అయితే ఆ అధికారం వారికి లేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా తాము అధీకృత వ్యక్తులుగా పేర్కొంటూ విక్రయించినట్లు నిహారిక సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. నజ్రీభాగ్ విక్రయానికి సంబంధించి వారి మధ్య జరిగిన ఈమెయిల్స్‌ను తాము సేకరించామని, ఈ కేసులో ఇవి కీలక ఆధారాలుగా ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఫోర్జరీ, మోసం తదితర ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని, ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో అరెస్టులు చేపట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఐరిష్ హాస్పిటాలిటీస్ యజమానులు అమిత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లా పాత్రను సైతం ఈఓడబ్ల్యూ అనుమానిస్తోంది. వీరూ నిందితులతో కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు భావిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సాక్షి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించగా... రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారమే నజ్రీభాగ్‌ను ఐరిష్ హాస్పిటాలిటీస్ పేరిట బదిలీ చేశాం. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని పత్రాలు పరిశీలించాం. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలోని డైరెక్టర్ల మధ్య స్పర్థలే ఈ వివాదానికి కారణమని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. -
ప్రైవేటు కంపెనీకి కింగ్‌కోఠి ప్యాలెస్ అమ్మకం!
అలనాటి నిజాం చరిత్ర వైభవానికి ఆనవాలుగా ఉన్న కింగ్‌కోఠి ప్యాలెస్ (పరదాగేట్) ఇక కనుమరుగుకానుంది. చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ ప్యాలెస్ కనుమరుగుకానుందన్న వాస్తవం పురావస్తు, చరిత్ర ప్రేమికులు జీరి్ణంచుకోవటమూ కాస్త కష్టమే మరి. మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ భవనం నిజాం రాజులనాటి చారిత్రక వైభవానికి కింగ్‌కోఠి ప్యాలెస్ శిథిల సజీవ సాక్ష్యం. 70 ఏళ్లుగా నిజాం వారసుల చేతుల్లో ఉన్న ఈ భారీ భవనం యాజమాన్య హక్కులు గతంలోనే చేతులు మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్ సంస్థ ఐరిస్ ఈ భారీభవంతిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చి ఓ భారీ బిజినెస్ మాల్‌ను నిర్మించేందుకు ఐరిస్ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో కింగ్‌కోఠి ప్యాలెస్ కాస్తా ఇక నుంచి బిజినెస్ మాల్గా మారనుందని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ చేతులు మారిందిలా.. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందిన ఐదువేల గజాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతి నజ్రీభాగ్ (పరదాగేట్)కు చాలాకాలం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హోల్డర్‌గా వ్యవహరించారు. ఎస్త్రా నుంచి ముంబైకి చెందిన నిహారిక కన్స్ట్రక్షన్స్ కంపెనీ కొనుగోలు చేయగా తాజాగా నిహారిక కన్స్ట్రక్షన్స్ నుంచి ఐరిస్ హోటల్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న మూడు భవనాల్లో ఒకదాన్లో ఈఎన్టీ ఆస్పత్రి నడుస్తుండగా, మరో భవనంలో నిజాంట్రస్ట్ కొనసాగుతోంది. పరదా కథ కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని ప్రధాన భవనం (నజ్రీబాగ్) పరదాగేట్‌గా ఇప్పటికీ ప్రసిద్ధే. ఈ భవనం ఇప్పటికీ పరదా వేసి ఉండటమే విశేషం. అప్పట్లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నివాస కేంద్రంగా కొనసాగిన ఈ భవంతిలో ఆయన ఉంటేనే పరదాని పైకి లేపి ఉంచేవారు. పరదా కిందకు వేసి ఉంటే ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారని అర్థం. నిజాం రాజు నిత్యం వెళ్లే దారిని నీళ్లతో కడిగి శుద్ధి చేసేవారు. ఇక్కడ నిత్యం సాయుధ పోలీస్ బలగాలతో భారీ పహారా ఉండేది. నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనంలోనే తుది శ్వాస విడువగా ఆయన సమాధి సైతం ఈ పరిసరాల్లోనే (జుడీ మస్జీద్) ఉండటం విశేషం. హెరిటేజ్ జాబితాలోనే కమాల్‌ఖాన్ ఆధ్వర్యంలో మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనానికి దేశంలోనే అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ నిర్మాణ శైలిని చూసేందుకు అనేక దేశాల ఆర్కిటెక్టులు వచ్చి పరిశీలించిన సందర్భాలున్నాయి. ఈ భవనం చాలాకాలం హెరిటేజ్ జాబితాలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల జాబితా ఏదీ అధికారికంగా లేకపోవటంతో ఈ భవనాన్ని ఐరిస్ హోటల్స్ కూలి్చవేసే అవకాశమే కనిపిస్తోంది. ఈ భవనానికి సరైన నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై ఇంటా క్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు అనురాధారెడ్డి స్పందిస్తూ.. నజ్రీబాగ్ ఎప్పటి నుంచో హెరిటేజ్ భవనంగా ఉందని, ఆ భవనం కూలి్చవేతను అడ్డుకుంటామని పేర్కొన్నారు. కొనుగోలు వివాదం నిజాం ట్రస్ట్ నుంచి ఈ భవనాన్ని తొలుత నిహారిక ఇన్ఫ్రా కంపెనీ కొనుగోలు చేయగా, ఇదే కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఐరిస్ హోటల్స్‌కు విక్రయించారు. ఈ విషయమై నిహారిక డైరెక్టర్లు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖ సైతం హైదరాబాద్ జిల్లా రిజి్రస్టార్‌కు చేరింది. ఈ విషయమై రిజి్రస్టార్ డీవీ ప్రసాద్‌ను వివరణ కోరగా తాము అన్ని పరిశీలించాకే రిజిస్టర్ చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
నిజాం నిధులెవరికి?
సాక్షి, హైదరాబాద్: నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచుకున్న భారీ నగదు వివా దం త్వరలో తేలిపోనుంది. హైదరాబాద్‌పై సైనిక చర్యకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ అయిన మొత్తం రూ.వందల కోట్లకు చేరటంతో భారత్, పాకిస్తాన్‌తో పాటు నిజాం వారసుల్లోనూ కదలిక మొదలైంది. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 1.7 లక్షల పౌండ్లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. కుమారుడు ఆజంజా, కోడలు దుర్రేషెవార్, మనుమలు ముకర్రం, ముఫకంజాలతో ఉస్మాన్ అలీఖాన్. చిత్రంలో అప్పటి గవర్నర్ భీంసేన్ సచార్ ఆయుధాల కోసమన్న పాకిస్తాన్.. హైదరాబాద్ విలీనానికి ముందు ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా ఉన్న లాయక్ అలీ నగదును పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. దేశ విభజన అనంతరం లాయక్ అలీ పాకిస్తాన్ పౌరసత్వం పొందటంతో ఈ నిధులు తమకే చెందుతాయని పాకిస్తాన్ వాదించింది. దీనికి తోడు భారత్ దాడిని ఎదుర్కొనేందుకు ఉస్మాన్ అలీఖాన్ ఆయుధాల సరఫరా కోసం ఆ మొత్తాన్ని తమకు పంపాడని కూడా పేర్కొంది. తీర్పు భారత్, నిజాం వారసులకు అనుకూలంగా వస్తే ఎవరి వాటా ఎంత అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజాం అసలు వారసులతో పాటు మరో 4 వేల మంది వరకు క్లెయిమ్ చేసుకుంటున్నారని నిజాం పాలనపై పరిశోధన చేసిన ఇజాస్ ఫారుఖీ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాది వెంకటరమణ మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆస్తినే నిజాం పంపారని పేర్కొన్నారు. అందుకే ఈ మొత్తాన్ని తెలంగాణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. -
కుప్పకూలిన సీబీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన గౌలిగూడలోని సెంట్రల్ బస్‌స్టేషన్(సీబీఎస్) నేలకూలింది. మిసిసిపీ హేంగర్గా నగర ప్రజలకు సుపరిచితమైన ఈ ప్రయాణ ప్రాంగణం గురువారం తెల్లవారుజామున కూలిపోయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ బస్సుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉన్న సీబీఎస్ శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ అధికారులు కొద్దిరోజులుగా బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అందులో ఉన్న దుకాణాలు, ప్రయాణికుల సదుపాయాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలను తొలగించారు. అధికారులు ఊహించినట్లుగానే గురువారం సీబీఎస్ ఒకవైపు పూర్తిగా నేలకొరిగింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మిసిసిపీ హేంగర్‌ను పరిశీలించారు. బస్‌స్టేషన్ కూలిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్ నిర్మిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నామని తెలిపారు. ఎంతోకాలంగా సీబీఎస్‌లోనే ఉపాధి పొందుతున్న స్థానికులు తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని మంత్రిని కోరారు. దుకాణాలు కోల్పోయిన వారికి మరోచోట వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదీ మిసిసిపీ హేంగర్ చరిత్ర.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మిసిసిపీ హేంగర్‌ను నిర్మించారు. 1926లో హైదరాబాద్ సంస్థాన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పరిషద్ అధ్యక్షతన నగరంలో బస్సు రవాణా వ్యవస్థ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు వివిధ రకాల రవాణా వ్యవస్థలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అప్పటికే ఇంగ్లండ్‌లో పేరొందిన అల్బియన్ మోటర్ కంపెనీకి చెందిన బస్సులను హైదరాబాద్‌లో నడిపేందుకు చర్యలు చేపట్టారు. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఇవి రోడ్డెక్కాయి. అప్పట్లో పుతిలీబౌలీ కేంద్రంగా 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బస్సులతో పాటు వాటిని నిలిపేందుకు బస్‌స్టేషన్ అవసరమని గ్రహించి.. విదేశాల్లో బస్సులు, రైళ్లు, విమానాల రిపేరింగ్‌కు ఉపకరించే షెడ్డుల మాదిరిగా గౌలిగూడలో ఒక భారీ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఏవియేషన్ హేంగర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంగ్లండ్‌కు చెందిన బట్లర్ స్టీల్ కంపెనీ మిసిసిపీ హేంగర్‌ను నిర్మించింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు విడిభాగాలతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవనంలా కాక అర్థచంద్రాకారంలో బస్సులు దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తరం వైపు వెళ్లేలా నిర్మించారు. 1932 నుంచి వినియోగంలోకి రాగా.. మొదట్లో బస్సుల రిపేరింగ్, నైట్ హల్ట్ కోసం దీనిని వినియోగించారు. ఆ తర్వాత ప్రయాణికుల ప్రాంగణంగా సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ.. 1951లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భాగమైంది. మిసిసిపీ హేంగర్ నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడిచేవి. 2004లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) నిర్మించే వరకూ గౌలిగూడ బస్స్టేషనే ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉండేది. ఆ తర్వాత దీనిని సిటీ బస్సుల నిర్వహణ కోసం వినియోగించారు. ఇటీవల వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 510 బస్సులు మిసిసిపీ హేంగర్ నుంచి రాకపోకలు సాగించాయి. ఈ మార్గంలో నిత్యం 2,385 ట్రిప్పులు తిరిగేవి. 85 వేల మంది రాకపోకలు సాగించేవారు. అలాగే కర్నూలు, కడప, నెల్లూరు, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల బస్సులకు ఇది నైట్‌హాల్ట్‌గా ఉండేది. సంక్రాంతి, దసరా వంటి రద్దీ రోజుల్లో జిల్లాల బస్సులు ఎక్కువ శాతం ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవి. అనుమానాలెన్నో..? మిసిసిపీ హేంగర్ నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకూ బస్సులు రాకపోకలు సాగించాయి. అలాంటి ప్రయాణ ప్రాంగణం దానికదిగా కూలిపోయినట్లుగా కాకుండా ‘యు’ఆకారంలో ఉన్న షెడ్డు దిగువ భాగం నిదానంగా నేలలోకి కూరుకుపోయిన తీరు, ముందస్తుగానే బస్సుల రాకపోకలను నిలిపివేయడం అనుమానాలకు తావిస్తోంది. షెడ్డు కింద ఉన్న నట్లు, బోల్టులు తొలగించడంద్వారా అది కుంగిపోయేలా చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూల్చివేశారని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి ఆరోపించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించకుండా కూల్చివేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అధునాతన బస్‌స్టేషన్ నిర్మాణం.. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అతిపెద్ద వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. మొదటి అంతస్తులో బస్‌స్టేషన్.. ఆ పైఅంతస్తుల్లో షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, వినోద కేంద్రాలను నిర్మించనున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిటీ బస్సులతో పాటు కొన్ని జిల్లాల బస్సులను కూడా ఇక్కడి నుంచే నడపనున్నారు. -
సాలార్జంగ్...ఓ గొప్ప కళాభిమాని
‘సాలార్జంగ్ 3’ మీర్ యూసుఫ్ అలీఖాన్ గొప్ప కళాభిమాని. అరుదైన వస్తువుల సేకరణ ఆయన హాబీ. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశ, విదేశాలు పర్యటించి ఎన్నో గొప్ప కళాఖండాలను సేకరించారు. పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆయన జీవితాశయం. కళాఖండాల సేకరణ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. 1949 మార్చి 2న తుది శ్వాస విడిచారు. మరణాంతరం ఆయన నివాసం ఉన్న దివాన్దేవిడీలోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. నూతన భవనాలు నిర్మించాక కళాఖండాల్ని అందులోకి తరలించారు. అదే ప్రస్తుత సాలార్జంగ్ మ్యూజియం. 43,000 కళాఖండాలు, 50 వేలకు పైగా అరుదైన పుస్తకాలు ఈ మ్యూజియం సొంతం. ప్రతి ఏటా 10 లక్షల నుంచి 15 లక్షల మంది దీనిని సందర్శిస్తుంటారు.