World Largest Truck: చాలా మంది ఇప్పటి వరకు నాలుగు, ఎనిమిది, పదహారు చక్రాల ట్రక్కులను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రక్కు వాటన్నింటికంటే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కు కావడం గమనార్హం. 'బెలాజ్ 75710' (Belaz 75710) పేరు కలిగిన ఈ ట్రక్కు ఒకసారికి సుమారు 500 టన్నుల బరువును తీసుకెళుతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా ప్రసిద్ధి చెందిన ఈ వాహనం బెలారస్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ట్రక్కులను తయారు చేసే BelAZ కంపెనీ సోవియట్ యూనియన్ కాలంలో బెలారస్, జోడినో నగరంలో ఉండేది. సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తరువాత ఈ కంపెనీ ఇతర దేశాల కంటే పెద్దగా ఉండే వాహనాలను తయారు చేయడం ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కూడా కైవసం చేసుకుంది.
(ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?)
ఇక బెలాజ్ 75710 విషయానికి వస్తే.. దీని బరువు 450 టన్నులు. దీనికి 8 చక్రాలు అమర్చారు, ఒక్కొక్క టైర్ బరువు సుమారు 5 టన్నుల కంటే ఎక్కువ. ట్రక్కు పొడవు 20 మీటర్లు, వెడల్పు 9.7 మీటర్లు. లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈ ట్రక్కు స్పీడ్ 45 కిమీ/గం కాగా, ఖాళీగా ఉన్నప్పుడు 60 కిమీ/గం వేగంతో వెళుతుంది. ఇంత పెద్ద భారీ ట్రక్కు పనిచేయాలంటే ఒక్క ఇంజిన్ సరిపోదు. కావున ఇందులో రెండు డీజిల్ ఇంజిన్లు అమర్చారు.
(ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!)
బెలాజ్ 75710 ట్రక్కులోని 16 సిలిండర్ టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్లు 2300 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రస్తుతం ఈ ట్రక్కుని సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలు క్వారీలలో చాలా ఉపయోగపడతాయి. దీని ధర సుమారు రూ. 50 కోట్లకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment