
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి జరగనుంది.

ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహాబంధంతో అడుగుపెట్టనున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుంది.

అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతోంది.

తమకు కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ఇవ్వనున్నారని టాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్.

నాగచైతన్యకు రేసింగ్ కార్లంటే చాలా ఇష్టం.

అందుకే ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను ఇవ్వనున్నట్లు టాక్.

ఇటీవల జరిగిన ఏఏన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే కోడలు శోభిత పాల్గొన్న సంగతి తెలిసిందే.



