
అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగే టైమ్ వచ్చేసింది.

డిసెంబరు 4న నాగచైతన్య-శోభిత పెళ్లితో ఒక్కటి కానున్నారు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగనుంది.

ఇప్పటికే పెళ్లి పనుల్లో రెండు కుటుంబాలు చాలా బిజీగా ఉన్నాయి.

మరోవైపు ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారనేది కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కూడా కనిపించనున్నారు.

బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కూడా హాజరవుతారని టాక్.

ఈ పెళ్లిలో మరీ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా గెస్ట్‌లు వచ్చే ఛాన్స్ ఉందట.

వీళ్లతో పాటు టాలీవుడ్ నుంచి మరికొందరు హీరోహీరోయిన్లు కూడా పాల్గొనొచ్చని సమాచారం.







