
ఒకప్పుడు ముఖేష్ అంబానీ మాదిరిగానే.. అనిల్ అంబానీ కూడా ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉండేవారు.

ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు.. ముందుచూపు లేని వ్యాపారాలు చేయడం వల్ల సంపన్నుల జాబితా నుంచి లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయిన స్థితికి చేరారు.

సరైన ప్రణాళిక, విజన్ లేకుండా ఏకకాలంలో అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికామ్, పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో గొప్ప సక్సెస్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేక పోయాయి.

ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం వంటివి కుబేరుడైన అనిల్ అంబానీని అప్పుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది.

అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, తిరిగి చెల్లించలేకపోయారు. మూడు బ్యాంకులకు సుమారు రూ.5446 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన లండన్ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో చెప్పుకున్నారు.

లాయర్ల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల.. అతను తన భార్య బంగారు నగలను అనిల్ అంబానీ విక్రయించినట్లు సమాచారం.

ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలు కూలిపోతాయి అనటానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ.












