
ఐసీసీ ఈవెంట్లలో ప్రతీ సారి నిలకడైన ప్రదర్శన కనబర్చే న్యూజిలాండ్ జట్టు ఈ సారి టి20 వరల్డ్ కప్‌లో పేలవ ఆటతో కనీసం సూపర్–8కు కూడా చేరకుండా నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్ తాను నాయకుడిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

అంతేకాదు.. వన్డే కెప్టెన్సీకి కూడా అతను రాజీనామా చేశాడు.

టి20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ చేతుల్లో ఓడిన కివీస్ జట్టు ఉగాండా, పపువా న్యూగినీలపై మాత్రమే గెలుపొందింది.

తాజా పరిణామాలతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌నుంచి కూడా కేన్ తప్పుకున్నాడు.

అయితే ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని అతను వెల్లడించాడు.

తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు, లీగ్ క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు

ఈ క్రమంలో కేన్ మామ ఫ్యామిలీ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు

సారా రహీం అనే మహిళతో 2015 నుంచి సహజీవనం చేస్తున్నాడు కేన్ విలియమ్సన్

యునైటెడ్ కింగ్‌డమ్‌లో జన్మించిన 34 ఏళ్ల సారా.. వృత్తిరిత్యా నర్స్ అని సమాచారం.

కేన్ విలియమ్సన్- సారా రహీమ్‌లకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు

ఏడాది క్రితమే విలియమ్సన్ టెస్టు కెప్టెన్ హోదాను కూడా స్వచ్ఛందంగా వదులుకున్నాడు.

విలియమ్సన్ కెప్టెన్సీ 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టి20 వరల్డ్ కప్‌లలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్...2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.

మొత్తం 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టి20ల్లో అతను కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు కేన్ విలియమ్సన్.





