సాక్షి, మెదక్ : సీఎస్‌ఐ చర్చి నిర్మాణం మహా అద్భుతమని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రోస్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన చర్చిని సందర్శించి దాని విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5న ప్రపంచ క్రైస్తవ సంఘనాయకుల అధిపతి మెదక్ చర్చిని సందర్శించేందుకు వస్తున్నారని, దానికోసం ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ ఎకనామిక్ అడ్వయిజర్ నలినిరఘురామన్‌తో పాటు చర్చి నిర్వాహకులు ఉన్నారు.
మెదక్‌లో పర్యటన
మెదక్ రూరల్: బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గురువారం మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌కు కలెక్టర్ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా భౌగోళిక పరిస్థితులు, చారిత్రాత్మక కట్టడాలు, వ్యవసాయ అనుకూల పరిస్థితులతో పాటు జిల్లాలోని ముఖ్య అంశాల గురించి వివరించారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ఇంటర్న్ జార్జ్ హనోక్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment