british deputy high commissioner
-
టాలీవుడ్ హీరోను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్.. ఎందుకంటే!
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్ కొట్టిన హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎస్జే సూర్య కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా నేచురల్ స్టార్ నానిని బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్ విన్ ఓవెన్ నానితో కాసేపు ముచ్చటించారు. నాని సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నానని ఆయన పోస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాని నటించిన ఏవైనా రెండు సినిమాలు చూసేందుకు సలహా ఇవ్వమని నెటిజన్లను కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సరిపోదా శనివారం మూవీని తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Absolute pleasure to meet @NameisNani to talk about his career behind and in front of the camera and how we can strengthen 🇬🇧 links with #Tollywood. He suggested a couple of his movies to watch. Which Natural Star movie would you recommend? pic.twitter.com/0cGFWNock2 — Gareth Wynn Owen (@UKinHyderabad) March 25, 2024 -
చిరంజీవిపై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ వోవెన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1,500 మంది రక్తదాతలకు రూ.7 లక్షల విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు. ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’–2022 అవార్డును గెలుచుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప సంబంధాలు నెలకొల్పేందుకు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 10లక్షలయూనిట్ల రక్తదానం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించడం గొప్ప గౌరవమని, ఎంతోమంది రక్తదాతలకు ఇది మరింత స్ఫూర్తినిస్తుందని చిరంజీవి చెప్పారు. ఈ బ్లడ్ బ్యాంకులో ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల రక్తదానం చేశామని, నేత్ర బ్యాంక్ ద్వారా 9,060 మందికి కంటిచూపు పునరుద్ధరించామని వెల్లడించారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఇది సహాయ పడిందన్నారు. రక్తం దొరకక తన దూరపు బంధువు ఒకరు చనిపోయినప్పుడు పడ్డ ఆవేదన నుంచే బ్లడ్ బ్యాంకు ఆలోచన వచ్చిందని వివరించారు. బ్లడ్‌బ్యాంకుకు అవసరమైన సాంకేతిక నిపుణుల కొరత ఉండటం వల్లే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిచోట తన అభిమానులు చెప్పగానే రక్తదానం చేస్తున్నారని..అభిమానులున్న చోట బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లేనని వెల్లడించారు. ఇటీవల ఓ తల్లి తన బాబు(8)కు ప్లేట్‌లెట్స్‌ను తన అభిమానులు ఇచ్చి ప్రాణాలు కాపాడారని ఓ సందేశం పంపినప్పుడు తనకు చాలా ఆనందం కలిగిందన్నారు. కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
Garath Wynn Owen: హైదరాబాద్ తిండి తెగ నచ్చేసింది!
ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది! ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్‌లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన! చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి ‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్‌లాండ్‌లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్‌ఫుడ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్‌లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’ ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది ‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’ హైదరాబాదీ హడావుడి బాగుంది ‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్‌ఫుడ్ కోసం లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్‌కు వెళ్లా. ఓల్డ్సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్‌ల్యాండ్ మేయర్‌తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’ చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు ‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్‌లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌తో గడిపానని అస్సలు అనిపించలేదు’’ నా సైకిల్ వచ్చేస్తోంది ‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్‌లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’ పిల్లలూ కలిసిపోయారు ‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్‌లు ఉన్నారు. ఇక్రిశాట్లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్‌కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’ -
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌కు ఆవకాయ రుచి చూపించిన చిరంజీవి
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్‌కు అతిథ్యం ఇచ్చారు. ఈ భేటీలో బ్రిటన్, భారత్ సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. 'బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉంది. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. నోరూరించే ఆవకాయ కూడా రుచి చూశారు' అంటూ చిరు పేర్కొన్నారు. భేటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS — Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022 -
సీఎం జగన్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
-
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఇతర సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. వారితో వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాల గురించి ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. యూకే – భారత్ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై విన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాల్లో కలిసి పని చేస్తాం ఐటీ, పరిశోధన రంగాలపై బ్రిటిష్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకు హామీ ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటిష్ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతి గురించి కూడా వారితో చర్చించారు. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్న విన్ ఓవెన్.. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా చర్చించారు. విద్యా రంగానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రిటీష్ కమిషన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రకటన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రణాళికపై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు కురిపించారు. ఈ కాన్సెప్ట్‌కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ బృందానికి సీఎం వివరించారు. ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై చర్చించారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. -
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆర్థిక, వ్యవసాయ, ఆక్వా, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు. విశాఖలో మంగళవారం ఆండ్రూ ఫ్లెమింగ్, ముంబైలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ దక్షిణాసియా కమిషనర్ అలన్ గెమ్మెల్ ఓబీఈ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్‌మాలి తదితరులతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని మంత్రి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ఇక్కడ పవన విద్యుత్ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు యూకేకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ఐటీ రంగానికి అనువైన అన్ని మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఉన్నాయని చెప్పారు. అలన్ గెమ్మెల్ ఓబీఈ మాట్లాడుతూ మెరైన్, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. ఏపీ, బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు ఇక్కడ ఏపీతో కలిసి ష్రింప్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి నుంచి కె.రామేశ్వర్, అముక్తామెహర్ పాల్గొన్నారు. -
‘మా మున్ని కనిపిస్తే చెప్పండి ప్లీజ్’
బంజారాహిల్స్: దీపావళి పండుగ రోజున సాయంత్రం టపాసుల మోతకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెంపుడు శునకం తప్పిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే ఆండ్రూఫ్లెమింగ్ దంపతులు తన పెంపుడు కుక్కను ‘మున్ని’ అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈనెల 4వ తేదీన దీపావళి రోజు రాత్రి స్థానిక ప్రజలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ శబ్ధాలకు బెదిరి తమ పెంపుడు కుక్క ఇల్లు దాటి పారిపోయిందని చెబుతూ, ఈ మేరకు కుక్క ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు 87909 61118 ఫోన్ నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
బర్మింగ్‌హామ్‌లో ‘బెస్టాఫ్ లక్’
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 22వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మెగా ఈవెంట్‌కు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ‘కౌంట్‌డౌన్’గా హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తదితరులతో పాటు వచ్చే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న వర్ధమాన అథ్లెట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... క్రీడల నిర్వహణ కోసం ఇంగ్లండ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, బరి్మంగ్‌హామ్ నగర విశిష్టతల గురిం చి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యం లో సీడబ్ల్యూజీ–2022లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు అంకితా రైనా పరాజయం సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ప్లేయర్ అంకితా రైనాకు అర్హత పోరులోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా తన సమ ఉజ్జీలాంటి ప్రత్యర్థితో సాగిన పోరులో చివరకు ప్రపంచ 193వ ర్యాంకర్ అంకితకు ఓటమి తప్పలేదు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ఆమె అమెరికాకు చెందిన ప్రపంచ 194వ ర్యాంకర్ జేమీ లోయబ్ చేతిలో 3–6, 6–2, 4–6 తేడాతో ఓటమిపాలైంది. -
వావ్.. సిద్దిపేట!
సాక్షి, గజ్వేల్/వర్గల్/సిద్దిపేటజోన్: వృక్ష సొరంగం, పల్లె అందాల సోయగాన్ని చూసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముగ్ధుడయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని పలు గ్రామాలను మార్నింగ్ వాక్‌లో భాగంగా సందర్శించిన ఆయన, పల్లె అందాలను స్వయంగా కెమెరాలో బంధించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధానంగా వర్గల్ మండలంలోని నవోదయ విద్యాలయ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను వృక్ష సొరంగంగా అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ బస పేరుతో పల్లె అందాలను, వ్యవసాయ పనిముట్లుగా వాడే ఎడ్లబండి, నిండుకుండలా ఉన్న వర్గల్‌లోని పెద్దచెరువు, సైకిల్, గడ్డివాము రక్షణకు కట్టిన చీర, కనువిందు చేసిన గోగి పూవు తదితర భిన్నమైన దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. తన పోస్టులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సైతం ట్యాగ్ చేశారు. ఒకప్పుడు తాను చూసిన సిద్దిపేట జిల్లా.. ప్రస్తుతం ఊహించనంతగా మారిందని ప్రశంసించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట ఎంతగానే మారిందని.. మూడేళ్ల క్రితం తాను చూసిన దానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు. నీరు పుష్కలంగా ఉండటంతో సాగు భూములు కనుచూపు మేర పచ్చదనం సంతరించుకుని శోభాయమానంగా కనువిందు చేస్తున్నాయని తెలిపారు. Sunday walk in Siddipet#RuralTelangana pic.twitter.com/Psirtbezj0 — Dr Andrew Fleming (@Andrew007Uk) February 14, 2021 Good morning Siddipet! pic.twitter.com/YUd3S1cIoI — Dr Andrew Fleming (@Andrew007Uk) February 14, 2021 -
కలిసి పనిచేస్తేనే కరోనా నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: ఈ కరోనా సంక్షోభ సమయంలో ఏ దేశమూ ఒంటరిగా మనలేదని, అన్నిదేశాలూ కలసి పనిచేస్తేనే విపత్తు నుంచి బయటపడటం సాధ్యమని అంటున్నారు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బ్రిటన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ, ఇరుదేశాల మధ్య సహకారం వంటి అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. సాక్షి: కరోనా కట్టడికి సిద్ధమవుతున్న వ్యాక్సిన్లలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా ముందు వరుసలో ఉంది. ఈ టీకా పేదలందరికీ చౌకగా అందేందుకు బ్రిటన్ ఏమైనా చర్యలు తీసుకుంటోందా? ఫ్లెమింగ్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా తయారీ కోసం ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్లో వంద కోట్ల డోసుల టీకా తయారవ్వనుంది. ఇందులో 40 కోట్లు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చేలా బ్రిటన్ చర్యలు తీసుకుంది. ఆస్ట్రాజెనెకా ఈ టీకాలను పిల్లల కోసం ఉచితంగా అందివ్వనుంది. టీకా అభివృద్ధి కోసం యునైటెడ్ కింగ్డమ్ పెద్ద ఎత్తునే నిధులు సేకరించింది. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం సుమారు రూ.7,434 కోట్లు సమీకరించింది. అంతేకాకుండా జూన్ 4వ తేదీన గావీ (గ్లోబల్వ్యాక్సిన్ అలయన్స్)తో కలసి సుమారు 700 కోట్ల పౌండ్లు కూడగట్టగలిగాం. ఈ నిధుల్లో కొంత భాగం కోవిడ్ పరీక్షలు, చికిత్స అందరికీ అందేలా చేసేందుకు ఉపయోగించనున్నాం. కోవిడ్ సమయంలో యునైటెడ్ కింగ్డమ్, భారత్‌ల మధ్య సహకారం ఎలా ఉంది? కోవిడ్ విజృంభణ మొదలైన మార్చి నుంచి బ్రిటన్–భారత్ పలు అంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. వ్యాధుల నియంత్రణ విషయంలో బ్రిటన్‌కు ఎంతో అనుభవముంది. ఈ నైపుణ్యాన్ని భారత్‌తోనూ పంచుకుంటున్నాం. కోవిడ్ నిర్ధారణ కోసం కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సరికొత్త పరీక్ష పద్ధతిని అపోలో ఆసుపత్రి ద్వారా పరీక్షిస్తున్నాం. ‘బీహోల్డ్ ఏ.ఐ’అనే బ్రిటన్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ పద్ధతిలో కేవలం ఛాతీ ఎక్స్ రే సాయంతోనే కోవిడ్ ఉన్నదీ లేనిదీ 30 సెకన్లలో నిర్ధారించవచ్చు. అంతేకాదు.. కోవిడ్ వచ్చినప్పటి నుంచి బ్రిటన్ భారీ ఎత్తున పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులు, పారాసిటమాల్ మాత్రలు కొనుగోలు చేసింది. కోవిడ్ టీకా అభివృద్ధి, తయారీల్లో ప్రపంచానికి మందుల షాపు లాంటి భారత్ కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల కాలంలో బ్రిటన్ తెలుగు రాష్ట్రాల్లో పలు కొత్త కార్యక్రమాలు చేపట్టింది. వాటి గురించి వివరిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఇటీవల మొదలైన 108 అంబులెన్స్ సర్వీస్‌లో బ్రిటన్ కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన సాయం అందిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతోంది. అంతేకాకుండా విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్లో వైద్య పరికరాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్నాం. మధుమేహంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. అత్యంత ప్రయోజనకరమైన పది స్టార్టప్‌లను గుర్తించి ప్రోత్సహిస్తాం. తెలంగాణలోనూ మెడ్‌టెక్ జోన్ అంశంపై మా ప్రభుత్వం సాయం అందిస్తోంది. యూకే.. ఈయూ నుంచి వచ్చే ఏడాది వైదొలగనుంది. దీనివల్ల భారతీయులకు ఎంత మేరకు లాభం చేకూరుతుంది? భారత్‌తోపాటు పలు ఇతర దేశాల వారికీ అవకాశాలు పెరుగుతాయి. ఈయూ నుంచి విడిపోవడం వల్ల ఆయా దేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవాలన్న పరిమితి తొలగిపోతుంది. ఫలి తంగా యూకేలోని ఉద్యోగాల కోసం అందరూ పోటీ పడవచ్చు. దీంతో భారతీయులకూ ఎక్కు వ అవకాశాలు వస్తాయి. ఇందుకు అనుగుణం గానే ఎక్కువ వీసాల జారీకి ప్రయత్నిస్తున్నాం. కోవిడ్ ఈ ప్రపంచానికి నేర్పిన పాఠాలేంటని.. మీరు అనుకుంటున్నారు? అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు అన్నది. అన్ని దేశాలకూ ఇది వర్తిస్తుంది. కోవిడ్ సమయంలో బ్రిటన్ చాలా దేశాలతో కొత్త సంబంధాలు ఏర్పరచుకుంది. వ్యాధికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకుంది. ఇరుదేశాలకూ లాభం చేకూరేలా ఈ సహకారం కొనసాగింది. కొనసాగుతోంది కూడా. అంతెందుకు శతాబ్దాల అనుబంధం ఉన్న భారత్‌తోనూ బ్రిటన్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కిందంటే అతిశయోక్తి కాదు. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాం. అమెరికా హెచ్–1బీ వీసాలపై పలు ఆంక్షలు విధిస్తోంది. టాలెంట్‌ను ఆకట్టుకునేందుకు ఇది మంచి అవకాశంగా బ్రిటన్ భావిస్తోందా? నైపుణ్యమున్న అన్ని రంగాల వారూ బ్రిట న్కు అవసరమే. వివిధ రంగాల్లో అత్యున్నత నైపుణ్యమున్న వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఆరోగ్య రంగంలో పనిచేసే వారు బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీసెస్‌తో కలసి పని చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇప్పటికే పలువురు వైద్యులు ఉపయోగించుకున్నారు కూడా. వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఇక్కడ గడించిన జ్ఞానం స్వదేశాల్లోనూ ఉపయోగడుతుందన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్ కోసం బ్రిటన్‌కు వచ్చే వారికి చదువులైపోయిన తర్వాత ఇంకో రెండేళ్లపాటు కొనసాగేందుకు ఇటీవలే వీలు కల్పించారు. పీహెచ్డీ విషయంలో ఈ పరిమితి మూడేళ్ల వరకు ఉంటుంది. -
మెదక్ చర్చి అద్భుతం
సాక్షి, మెదక్ : సీఎస్ఐ చర్చి నిర్మాణం మహా అద్భుతమని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రోస్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన చర్చిని సందర్శించి దాని విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5న ప్రపంచ క్రైస్తవ సంఘనాయకుల అధిపతి మెదక్ చర్చిని సందర్శించేందుకు వస్తున్నారని, దానికోసం ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ ఎకనామిక్ అడ్వయిజర్ నలినిరఘురామన్తో పాటు చర్చి నిర్వాహకులు ఉన్నారు. మెదక్‌లో పర్యటన మెదక్ రూరల్: బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గురువారం మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌కు కలెక్టర్ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా భౌగోళిక పరిస్థితులు, చారిత్రాత్మక కట్టడాలు, వ్యవసాయ అనుకూల పరిస్థితులతో పాటు జిల్లాలోని ముఖ్య అంశాల గురించి వివరించారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ఇంటర్న్ జార్జ్ హనోక్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. -
నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీకి బ్రిటిష్ కమిషనర్ ట్వీట్
హైదరాబాద్: భవన నిర్మాణంలో జరుగుతున్న అంతులేని నిర్లక్ష్యంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ జీహెచ్ఎంసీ అధికారులకు ట్వీట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లో తాను నివసిస్తున్న ప్రాంతంలో గతేడాది కాలం నుంచి నిరంతరాయంగా ఓ భవన నిర్మాణం జరుగుతోందని, రేయింబవళ్లు జరుగుతున్న ఈ నిర్మాణం వల్ల స్థానికంగా శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఆదివారం కూడా పనులు చేస్తూ నిబంధనలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీకి ఆన్లైన్లో పలుమార్లు తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదన్నారు. తన నివాసం శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడటం లేదని, అయితే చుట్టుపక్కల వారు మాత్రం శబ్ద, వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు మార్బుల్ తీసుకొచ్చే లారీలతోపాటు అన్లోడింగ్ చేసే సిబ్బంది అరుపులు, కేకలు చుట్టుపక్కల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. తాను ఒక హోదాలో ఉన్నాను కాబట్టి ఈ విషయాలు చెప్పగలుగుతున్నానని, ఒక సామాన్యుడు ఎలా చెప్పగలుగుతాడని అన్నారు. అసలు జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుండవా అని నిలదీశారు. ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేయగా.. సాయంత్రం వరకు కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం గమనార్హం. -
కారును ఢీకొట్టడమే కాకుండా దౌర్జన్యం
హైదరాబాద్ : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ఆయన కుమార్తెతోపాటు భార్యపై మరో కారు డ్రైవర్ దుర్భాషలాడాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ కుమార్తె ఫియోనా మెక్ అలిస్టర్ తన తల్లితో కలిసి సోమవారం రాత్రి షేక్‌పేట్ నాలా వైపు నుంచి కారులో అపర్ణ సినార్ వ్యాలీ వైపు వస్తుంది. ఆ క్రమంలో ఏపీ 29 ఏఎల్ 9332 కారు .. ఈ కారును ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. ఇదేమిటని కారు నడుపుతున్న డ్రైవర్‌తో పాటు అందులో కూర్చున్న ఫియోనా.. ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను ప్రశ్నించింది. దీంతో రెచ్చిపోయిన కారు డ్రై వర్ వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ... కారు అద్దాలు పగలగొట్టేందుకు యత్నించాడు. కారులోని మహిళలపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమాదానికి కారకుడైన కారు యజమానిపై ఐపీసీ సెక్షన్ 279, 341, 506ల కింద కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసును ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.