
బంజారాహిల్స్: దీపావళి పండుగ రోజున సాయంత్రం టపాసుల మోతకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెంపుడు శునకం తప్పిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే ఆండ్రూఫ్లెమింగ్ దంపతులు తన పెంపుడు కుక్కను ‘మున్ని’ అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈనెల 4వ తేదీన దీపావళి రోజు రాత్రి స్థానిక ప్రజలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ శబ్ధాలకు బెదిరి తమ పెంపుడు కుక్క ఇల్లు దాటి పారిపోయిందని చెబుతూ, ఈ మేరకు కుక్క ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు 87909 61118 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment