బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్‌కు అతిథ్యం ఇచ్చారు. ఈ భేటీలో బ్రిటన్, భారత్ సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు.
'బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉంది. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. నోరూరించే ఆవకాయ కూడా రుచి చూశారు' అంటూ చిరు పేర్కొన్నారు. భేటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.
Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022
Comments
Please login to add a commentAdd a comment