
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. వేకువజామున 4.30 గంటలకు బిషప్ ఏసీ సాల్మన్ రాజు మొదటి ప్రార్థనలతో చర్చిలో వేడుకలను ప్రారంభిస్తారు.