తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను.. | Delhi: Children’s home officer sexually assaulted girls, made videos | Sakshi
Sakshi News home page

తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను..

Published Thu, Jun 9 2016 11:46 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను.. - Sakshi

తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను..

న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో ఉండాల్సిన ఉద్యోగి కామాంధుడిగా మారాడు. తన పిల్లల వయసున్న వారిపై లైంగిక వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా తన చర్యలను సెల్ ఫోన్లో వీడియోలు తీశాడు. ఇలా అతడు చేసిన దారుణం ఒక్కరిపైనో ఇద్దరిపైనో కాదు.. పన్నెండుమంది బాలికలపైన. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొబైల్ ఫోన్ను తనిఖీల నిమిత్తం పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీనా అనే అధికారి 1998లో ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఇటీవలె అతడు సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టాడు.

అతడిని ప్రభుత్వం ఓ బాలికల సంరక్షణ గృహానికి అధికారిగా పంపించింది. అయితే, అలా వెళ్లిన అతడు ఈ నెల (జూన్) 2న వికృత చర్యలకు ప్రణాళిక రచించుకున్నాడు. పన్నెండుమంది 8 నుంచి 10 ఏళ్లలోపు ఉన్న బాలికలను ఓ గదిలోకి తీసుకెళ్లి టీవీ ఆన్ చేసి చూడమని చెప్పాడు. అనంతరం ఒక్కొక్కరిని తన వద్దకు వేరే గదిలోకి రావాలని ఆదేశించాడు.

అలా వచ్చిన బాలికను పరీక్షల పేరుతో చేతులు కట్టేసి అనంతరం అసభ్యంగా ముట్టుకుంటూ బట్టలు విప్పేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం పన్నెండుమందిపై ఇలాగే చేశాడు. ఇదంతా తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించాడు. అలా అతడి బారిన పడిన బాలికలు ఇన్ ఫెక్షన్కు గురికావడంతో అసలు విషయం బయటకు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement