నెల్లూరు: సోమశిల ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కార్యాలయంలో రెండువేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ అధికారి రమేష్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంత గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి ఒక పని విషయమై సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ రూ. 2వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అరుణ్‌కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా రమేష్‌కుమార్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.