ప్రమాదంలో దుర్గగుడి సూపరింటెండెంట్ మృతి | vijayawada durga temple Superintendent dies in road accident | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో దుర్గగుడి సూపరింటెండెంట్ మృతి

Published Mon, Feb 29 2016 9:23 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రమాదంలో దుర్గగుడి సూపరింటెండెంట్ మృతి - Sakshi

ప్రమాదంలో దుర్గగుడి సూపరింటెండెంట్ మృతి

తాడేపల్లి/ఇంద్రకీలాద్రి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలో ప్రకాశం బ్యారేజీపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గ గుడి సూపరింటెండెంట్ ఎంవీవీ సత్యానారాయణ మృతి చెందారు. మంగళగిరి మండలం ఉండవల్లిలో నివసించే సత్యనారాయణ దుర్గగుడిలో విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ప్రకాశం బ్యారేజీపై వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు.
 
ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ 35 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య అమ్మాజీ కూడా కొంత కాలం క్రితమే మృతి చెందారు. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కాగా, కుమారుడు వినాయక నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో మునిగి మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన స్థలం, ప్రస్తుతం సత్యనారాయణ ప్రమాదానికి గురైన ప్రదేశం ఒకే చోట కావడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement