
‘తీహార్’ సూపరింటెండెంట్‌గా మహిళా అధికారి
న్యూఢిల్లీ: తీహార్ పురుషుల జైలు సూపరింటెండెంట్‌గా తొలిసారి అంజూ మంగ్లా అనే మహిళా అధికారి నియమితులయ్యారు. ఆమె ఇంతకు ముందు మహిళల జైలుకు ఇదే హోదాలో సేవలందించారు. అత్యంత భద్రత ఉండే తీహార్ జైలుకు గతంలో కిరణ్ బేడీ, మిమలా మెహ్రా అనే మహిళా అధికారులు డైరెక్టర్ జనరల్స్‌గా చేశారు. మంగ్లా 18–21 ఏళ్ల మధ్యనున్న సుమారు 800 మంది ఖైదీలను పర్యవేక్షించనున్నారు.