
సాక్షి, అమరావతి : పురావస్తు శాఖ ఇటీవల టీటీడీకి జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం చెలరేగటంతో ఆశాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ టి.శ్రీలక్ష్మిని చెన్నైకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో చెన్నైలో పని చేస్తున్న రామన్‌ను నియమించారు. తిరుమల దేవాలయాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఈ నెల 5వ తేదీన సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి టీటీడీ కార్యనిర్వహణాధికారికి సర్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.
భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తోందని బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో చేసేది ఏమీలేక కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment