
సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారిన నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేలా చైనాకు చెందిన భారీ దిగ్గజ కంపెనీలు భారత్‌లో కొలువుతీరనున్నాయి. 600కు పైగా కంపెనీలు దేశంలో రానున్న ఐదేళ్లలో ఏడు లక్షల కొలువులు సృష్టించనున్నాయి.చైనాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ మెషినరీ తయారీ కంపెనీ శానీ హెవీ ఇండస్ర్టీస్, ఫసిఫిక్ కన్‌స్ర్టక్షన్, చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ తదితర చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇప్పటికే రూ 50,000 కోట్ల పైగా పెట్టుబడులతో పలు కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని, లక్ష మందికి ఉపాధి సమకూరిందని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది.
మరికొన్ని సంస్థలు త్వరలోనే పెట్టుబడులతో ముందుకు రానున్నాయి.కాగా, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియా ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 200 కంపెనీలతో కూడిన జాబితాను రూపొందించి ఆయా సంస్థలను ఒప్పించే ప్రక్రియ చేపట్టింది.రానున్న రెండేళ్లలో తాము రూ 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ బాగ్లా తెలిపారు. రోల్స్ రాయిస్ రూ 25,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, ఆస్ట్రేలియాకు చెందిన పెర్దమాన్ ఇండస్ర్టీస్ రూ 20,000 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ నెలకొల్పనుంది. భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనల్లో 42 శాతంతో చైనా ముందుండగా, అమెరికా 24 శాతం, బ్రిటన్ 11 శాతం పెట్టుబడులతో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఇంధన, వ్యర్థ నిర్వహణ రంగాల్లో అత్యధిక పెట్టుబడులు సమకూరగా, నిర్మాణ, ఈ కామర్స్ రంగాల్లోనూ పెట్టుబడులు భారీగా తరలిరానున్నాయి.
భారత్‌కు పెద్ద ఎత్తున రానున్న విదేశీ పెట్టుడులపై ఇన్వెస్ట్ ఇండియా బృందం ప్రధాని మోదీని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చిందని దీపక్ బాగ్లా చెప్పారు. దేశంలో నెలకొన్న రెడ్ టేప్ సమస్య నుంచి ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ పరిచేలా మార్చాలన‍్న ప్రధాని మోదీ స్ఫూర్తితో ఇన్వెస్ట్ ఇండియా ముందుకెళ్తోందని తెలిపారు. గత రెండేళ్లుగా 114 దేశాల నుంచి లక్ష మంది ఇన్వెస్టర్లు తమను పెట్టుబడి ప్రతిపాదనలపై సంప్రదించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment