
భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రెండు చైనా ఆర్మీ హెలికాప్టర్లు భారత గగనతలంలోకి వచ్చి ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెళ్లాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోకి ఇవి శనివారం వచ్చినట్లు అధికారులు చెప్పారు.
చైనా హెలికాప్టర్లు, విమానాలు అనుమతి లేకుండా భారత గగనతలంలోకి ప్రవేశించడం ఈ ఏడాది మార్చి నుంచి ఇది నాలుగోసారి. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రహస్యంగా కనుగొనేందుకు ఈ హెలికాప్టర్లు వచ్చాయని భావిస్తున్నారు.