బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ప్రపంచం సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌లో మునిగిపోయింది. మనుషులు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఎంతలా అంటే రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా గడపలేనంతగా మారిపోయారు. అలా ఓయువతి స్మార్ట్‌ఫోన్‌లో బానిసగా మారి ఫోన్‌లో ఒకరోజంతా ఆటలాడటం ద్వారా అంధురాలిగా మారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన షుడోనిమవూ జియాజింగ్ అనే 21 ఏళ్ల యువతి ఓకంపెనీలో ఫైనాన్స డిపార్ట్‌మెంట్‌లో పనిస్తోంది. ఈనెల ఒకటో తేదీన 'కింగ్ గ్లోరీ' అనే గేమ్‌ను రోజు మొత్తం ఆడింది. దీంతో ఆమె కుడి కన్ను పాక్షికంగా పనిచేయడం మానేసింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుడికన్ను రెటినాల్ ఆర్టరి ఆక్యులోషన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చూపు కోసం పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది.
జియాజింగ్ ప్రతిరోజు 8గంటల పాటు గేమ్ ఆడేది. కనీసం తిండి తినడం, ఏదైనా తాగకుండా ఏకధాటిగా ఆడేది. ఆక్టోబర్ ఒకటిన మాత్రం ఒకరోజంతా ఆటతోనే గడిపింది. దీంతో తన చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ గేమ్‌కు చైనాలో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏకంగా 200 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment