21 మంది మృతుల్లో భారతీయుడు
బీజింగ్: చైనాలోని జియాంగ్జూ నదిలో పడవ బోల్తా ఘటనలో 21 మంది మరణించారని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. మరోకరి ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. అందుకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. జియాంగ్జూ ప్రావెన్స్లో గురువారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
దాంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం ముగ్గురిని రక్షించారు. అయితే మిగిలిన 21 మంది మరణించారు. వారి మృతదేహలను శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల్లో నలుగురు సింగపూర్ వాసులతోపాటు భారత్, ఇండోనేసియన్, మలేసియన్, జపాన్ దేశాలకు చెందిన వారు ఒకొక్కరు ఉన్నారని వెల్లడించారు.