ముంబై: చైనా వస్తువులపై ఆధారపడి జీవనం సాగిస్తే ఆ దేశం ముందు తల దించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆయన ఆదివారం భరత 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఓ స్కూల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వదేశి అంటే భారత్ దేశంలో తయారైన వస్తువలను వాడాలని తెలిపారు. ప్రస్తుతం మనం సాంకేతికతను అధికంగా ఉపయోగిస్తున్నామని, కానీ మన దేశం వద్ద ఇంకా పూర్తి స్థాయి సాంకేతికత లేదని పేర్కొన్నారు. చాలా వరకు అంతా బయటి దేశాల నుంచి వస్తుందన్నారు. చైనా వస్తువులను నిషేధించామని ఎంత చెప్పినా.. మనం వాడే మొబైల్స్‌లోని కొన్ని యాప్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుకోవాలన్నారు.
చైనా వస్తువులుపై మీద మనం ఎక్కువగా ఆధారపడినంత కాలం ఆ దేశం ముందు తల దించుకోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్థిక భద్రత ప్రధానమైందని, సాంకేతిక పూర్తిగా మన దేశ నిబంధనలుకు అనుకూలమైనది ఉండాలన్నారు. స్వదేశి పేరుతో అన్నింటిని బహిష్కరించడం కాదని, ప్రపంచ వాణిజ్యంలో పాలుపంచుకుంటూ స్వావలంబన సాధించాలని చెప్పారు. ఇళ్లలో తయారు చేసుకొనే వస్తువులను మార్కెట్లల్లో కొనటం తగ్గించాలని తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి తాను వ్యతిరేకం కాదని, మన గ్రామాల్లో వస్తువుల ఉత్పత్తులను పెంచాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment