
సాక్షి అగర్వాల్
ప్రతి భారతీయుడిని ఇప్పుడు ఆగ్రహానికి చేస్తున్న అంశం చైనా దురాగతమే. నిబంధనలు తుంగలో తొక్కి ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో మన సైన్యంపై దాడులకు తెగపడుతోంది. దీంతో ప్రతి భారతీయుడు చైనాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు. చైనా ఉత్పత్తులను మన దేశంలో బహిష్కరించాలనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటి సాక్షి అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.
సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను ఇకపై చైనా ఉత్పత్తులను వినియోగించరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. శాంతికి సహనానికి మార్గం మన దేశంగా పేర్కొంది. చైనా దేశం మన దేశం సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందన్నారు. అందులో భాగంగానే ఇటీవల చైనా సైనికులు మన సైనికులపై దాడులకు తెగపడ్డారని పేర్కొంది. దీంతో చైనా చర్యల్ని తీవ్రంగా ఇకపై ఆ దేశ ఉత్పత్తులను ఉపయోగించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ఇకపై చైనాకు చెందిన ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా తాను నటించనని నటి సాక్షి అగర్వాల్ చెప్పింది. చదవండి: సుశాంత్‌కు గొప్ప నివాళి
Comments
Please login to add a commentAdd a comment