వాషింగ్టన్: అమెరికా నౌకాదళం (నేవీ)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారీస్థాయిలో చోరీ చేశారు. అమెరికా తయారుచేయబోయే కొత్త రకం జలాంతర్గాముల రహస్య సమాచారం సహా పలు కీలక వివరాలు చైనా హ్యాకర్లు సంపాదించారు. చోరీకి గురైన మొత్తం సమాచార పరిమాణం 614 జీబీ ఉంటుందనీ, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో హ్యాకింగ్ జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. సీ డ్రాగన్ అనే రహస్య ప్రాజెక్టు వివరాలు, సిగ్నళ్లు, సెన్సర్ల సమాచారం, సముద్రగర్భంలో యుద్ధానికి సంబంధించిన పలు వివరాలు చైనా హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఓ అధికారి చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment