అమెరికా నౌకాదళానికి చెందిన ఎఫ్-18 జెట్ విమానం ఒకటి సఫోక్‌లోని లాకెన్‌హీత్ ఆర్ఏఎఫ్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. సైనిక స్థావరానికి సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఈ విమానం కూలింది.
కేంబ్రిడ్జిషైర్ - సఫోక్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎమర్జెన్సీ సర్వీసులను వెంటనే పంపారు. ప్రస్తుతానికి తమకు కూడా వివరాలు ఏమీ తెలియలేదని కేంబ్రిడ్జిషైర్ పోలీసు అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పుడు అంతా అగమ్యగచరంగా ఉందని, అయితే ఈ విమానం మాత్రం సింగిల్ సీటర్ అని మాత్రం తెలిసిందని అన్నారు.
కుప్పకూలిన అమెరికా నేవీ జెట్ విమానం
Published Wed, Oct 21 2015 5:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement