భారత్‌కు ఎఫ్-16, ఎఫ్‌-18 ఫైటర్స్‌?! | Trump admin strongly supports sale of F-16, F-18 jets to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎఫ్-16, ఎఫ్‌-18 ఫైటర్స్‌?!

Published Thu, Sep 7 2017 3:38 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భారత్‌కు ఎఫ్-16, ఎఫ్‌-18 ఫైటర్స్‌?! - Sakshi

భారత్‌కు ఎఫ్-16, ఎఫ్‌-18 ఫైటర్స్‌?!

బలపడనున్న ఇండో-అమెరికా రక్షణ బంధం
భారత్‌కు బలంగా మద్దతిస్తున‍్న ట్రంప్‌


సాక్షి, వాషింగ్టన్‌ : భారత్‌- అమెరికా రక్షణ బంధం మరింత బలపడనుంది. ఇప్పటికే రక్షణ రంగంలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా భారత్‌కు ఎఫ్‌-16, ఎఫ్‌-18 ఫైటర్‌ విమానాలను అమ్మేందుకు ట్రంప్‌ పరిపాలనా వర్గం పచ్చజెండా ఊపింది. భారత్‌ తమకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా మారిందని అమెరికా చెబుతోంది.   

భారత్‌కు ఎఫ్‌16, ఎఫ్‌-18 యుద్ధవిమానాలను అమ్మేందుకు అమెరికా సానులకూంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పరిపాలన వర్గంలో కీలక వ్యక్తి అయిన అలీస్‌ వెల్స్‌ ప్రకటించారు. ఇండో-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో ఇదొక మైలురాయిగా వెల్స్‌ పేర్కొన్నారు. దక్షిణ, మధ్య ఆసియా తాత్కాలిక సహాయ కార్యదర్శిగా అలీస్‌ వెల్స్‌ వ్యవహరిస్తున్నారు. భారత్‌కు ఎఫ్‌-16, ఎఫ్‌-18 విమానాల అమ్మకానికి అనుమతించాలని కాంగ్రెస్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఇండో - పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌ అత్యంత శక్తివంతమైన, రక్షణాత్మకమైన దేశం మరొకటి లేదనే అభిప్రాయాన్ని వెల్స్‌ వ్యక్తం చేశారు.  

అంతర్జాతీయంగా భారత్‌ అత్యంత శక్తివంతమైన దేశం.. అంతేకాక వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారత్‌తో చేసుకునే దౌత్య, రక్షణ సంబంధాలు ఇరు దేశాల అభివృద్ధికి ఊతం కల్పిస్తుందని తెలిపారు. ‘భారత్‌, అమెరికాలు ఉగ్రవాద సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాలు. ముఖ్యంగా భారత్‌ చుట్టూ ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

నిరంతరం సరిహద్దుల గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నా’రని చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపడితే బాగుటుందని ఆయన సూచించారు. దశాబ్దకాలంగా భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అంతకంతకూ పెరుగుతోందని వెల్స్‌ చెప్పారు. 2006లో 45  బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు 2016 నాటికి 114 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement