
సెల్ కిల్
మార్కెట్లో నేడు ఎన్నో రకాల కంపెనీల సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ డిజైన్లలో.. అందమైన మోడళ్లలో.. ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మోడల్, ఫీచర్స్‌కు అనుగుణంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి.
సెల్‌ఫోన్ నేడు ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. అత్యవసరమైన వస్తువుగా మారింది. మొబైల్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైంది. అయితే చౌకగా లభిస్తున్నాయని ఆశపడి కొనే నాసిరకం సెల్‌ఫోన్లు విలువైన నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. అలాంటి ఫోన్లను కొంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతోంది. ఇటీవల జరిగిన పలు సంఘటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఎదులాపురం, న్యూస్‌లైన్ : మార్కెట్లో నేడు ఎన్నో రకాల కంపెనీల సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ డిజైన్లలో.. అందమైన మోడళ్లలో.. ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మోడల్, ఫీచర్స్‌కు అనుగుణంగా వి విధ ధరల్లో లభిస్తున్నాయి. పేరొందిన కంపెనీల మొ బైళ్లు అధిక ధర ఉండడం.. అవే ఫీచర్లు కలిగి ఉన్న చైనాలో తయారైన సెల్‌ఫోన్లు కారుచౌకగా లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంత యువకులు, కార్మికు లు ఎక్కువగా వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ కంపెనీల సెల్‌ఫోన్ల కంటే చైనా, స్థాని కంగా తయారైన మొబైళ్లు మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని సెల్‌పాయింట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. చైనా, స్థానికంగా తయారైన సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీ, చార్జ ర్లు, స్క్రీన్‌ల తయారీలో నాణ్యత ప్రమాణాలు పా టించకపోవడంతో ఇవి పేలిపోయే అవకాశాలు ఎ క్కువ.
అదే పేరొందిన కంపెనీల సెల్‌ఫోన్లలో విని యోగించే బ్యాటరీలు, చార్జర్లు, స్క్రీన్‌లు నాణ్యమైనవి కావడంతోపాటు షాక్‌ప్రూఫ్, ఓల్టేజి కంట్రోలింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. వీటి ధర ఎక్కువగా ఉండడంతో చైనా సెల్‌ఫోన్లు ప్రమాదకరమని తెలిసినా గ్రామీణులు ఎక్కవగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. నోకియా సాధారణ సెల్‌ఫోన్ బ్యాటరీ కంపెనీదైతే ఆరు నెలల గ్యారెంటీతో రూ.450 ధర ఉంది. అదే చైనా, లోకల్‌గా తయారైన బ్యాటరీ అయితే ఆరు నెలల గ్యారంటీ ఇస్తూ రూ.180 నుంచి రూ.250లకే లభిస్తున్నాయి. గ్యారంటీ అవసరం లేదనుకుంటే చైనా తయారీ బ్యాటరీ రూ.120లకే లభిస్తోంది. ప్రముఖ కంపెనీలు.. చైనాలో తయారైన బ్యాటరీల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. చైనా లో, స్థానికంగా తయారయ్యే సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అవి కుప్ప లు తెప్పలుగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
ప్రమాదాలకు నిలయం..
నాసిరకం చార్జర్లు, బ్యాటరీలు కలిగిన సెల్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. చార్జింగ్ పెట్టినప్పుడు పేలడమో.. చార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుడు పేలడం లేదా కరెంట్ షాక్ రావడం.. జేబులో పెట్టుకున్నప్పుడు పేలడం వంటి సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ సంఘటనల్లో పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇంకొందరు గాయపడిన సంఘటనలూ ఉన్నాయి.