ప్రపంచంలో తొలి 6 జీబీ ర్యామ్ ఫోన్ | Vivo Xplay5 boasts 6GB RAM and a familiar curved screen | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తొలి 6 జీబీ ర్యామ్ ఫోన్

Published Thu, Mar 3 2016 12:48 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

ప్రపంచంలో తొలి 6 జీబీ ర్యామ్ ఫోన్ - Sakshi

ప్రపంచంలో తొలి 6 జీబీ ర్యామ్ ఫోన్

స్మార్ట్‌ఫోన్ల తయా రీలో ఉన్న చైనా కంపెనీ వివో తాజాగా మరో సంచలనం సృష్టించింది.

వివో నుంచి ఎక్స్‌ప్లే-5 ఎలైట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయా రీలో ఉన్న చైనా కంపెనీ వివో తాజాగా మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో తొలిసారిగా 6 జీబీ ర్యామ్‌తో ఎక్స్‌ప్లే-5 ఎలైట్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మెటల్‌తో గొరిల్లా గ్లాస్ 4 కోటింగ్ బాడీతో రూపొందిం చారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ను పోలినట్టుగా ఈ ఫోన్‌కు రెండు వైపులా కర్వ్‌తో స్క్రీన్‌ను తయారు చేశారు. క్యూహెచ్‌డీ రిసొల్యూషన్‌తో 5.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2.15 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6 ఓఎస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, సోనీ సెన్సర్‌తో 16 ఎంపీ కెమెరా, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సర్ పొందుపరిచారు. మార్చి 8 నుంచి ముందుగా చైనాలో లభిస్తుంది. ధర సుమారు రూ.44 వేలు. కంపెనీ 4 జీబీ ర్యామ్, డ్యూయల్ కర్వ్‌తో ఎక్స్‌ప్లే-5 అనే మోడల్‌ను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement