కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు.
విజయవాడ : కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు. కల్తీ రక్కసి బారినపడి గత మూడు నెలలుగా విజయవాడ చిన్నఅవుటుపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ (50) అనే వ్యక్తి సోమవారం మృతిచెందాడు. శంకర్ మృతితో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.