వర్ణం: కనువిందైన దృశ్యం! | the scenery is feast to eyes | Sakshi
Sakshi News home page

వర్ణం: కనువిందైన దృశ్యం!

Published Sun, Feb 23 2014 4:31 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

వర్ణం: కనువిందైన దృశ్యం! - Sakshi

వర్ణం: కనువిందైన దృశ్యం!

 గౌహతి నగర శివారులో... సిమోలు పుష్పాలపై పక్షి వాలుతున్నప్పుడు తీసిన అద్భుత చిత్రమిది. ఈ పక్షి పేరు రుఫౌస్ ట్రీపై. ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని డెండ్రోసిటా వాగబండా అని పిలుస్తారు.
 
 చైనా మన్మథుడు !

 
 ఇది... చైనా పురాణాల్లో ప్రేమకు, పెళ్లికి దేవుడు అయిన ‘ది మ్యాచ్ మేకర్’ విగ్రహం. ఈ దేవుడికి మరో పేరు ‘ది ఓల్డ్ మ్యాన్ అండర్ ది మూన్’. తైపే నగరంలోని జియా హై సిటీ టెంపుల్‌లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా వీటిని అమ్మారు. ఈ దేవుడిని ఆరాధిస్తే త్వరగా ప్రేమలో పడతారట!


 
 52 దేశాలు, 2500 జంటలు!
 
 సామూహిక వివాహాలు కొత్తేం కాదు కానీ... అంతర్జాతీయ సామూహిక వివాహాలు మాత్రం అన్ని చోట్లా జరగవు. దక్షిణ కొరియా, గెపియాంగ్‌లోని యునిఫికేషన్ చర్చిలో ఓ అద్భుతం ఒకటి జరిగింది.. 52 దేశాలకు చెందిన 2500 జంటలు ఒకే ముహూర్తంలో ఇక్కడ మనువాడాయి. ఇన్ని దేశాలకు చెందిన వ్యక్తులతో జరిగిన సామూహిక వివాహాల్లో ఇది రెండోదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement