వర్ణం: కనువిందైన దృశ్యం!
గౌహతి నగర శివారులో... సిమోలు పుష్పాలపై పక్షి వాలుతున్నప్పుడు తీసిన అద్భుత చిత్రమిది. ఈ పక్షి పేరు రుఫౌస్ ట్రీపై. ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని డెండ్రోసిటా వాగబండా అని పిలుస్తారు.
చైనా మన్మథుడు !
ఇది... చైనా పురాణాల్లో ప్రేమకు, పెళ్లికి దేవుడు అయిన ‘ది మ్యాచ్ మేకర్’ విగ్రహం. ఈ దేవుడికి మరో పేరు ‘ది ఓల్డ్ మ్యాన్ అండర్ ది మూన్’. తైపే నగరంలోని జియా హై సిటీ టెంపుల్లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా వీటిని అమ్మారు. ఈ దేవుడిని ఆరాధిస్తే త్వరగా ప్రేమలో పడతారట!
52 దేశాలు, 2500 జంటలు!
సామూహిక వివాహాలు కొత్తేం కాదు కానీ... అంతర్జాతీయ సామూహిక వివాహాలు మాత్రం అన్ని చోట్లా జరగవు. దక్షిణ కొరియా, గెపియాంగ్లోని యునిఫికేషన్ చర్చిలో ఓ అద్భుతం ఒకటి జరిగింది.. 52 దేశాలకు చెందిన 2500 జంటలు ఒకే ముహూర్తంలో ఇక్కడ మనువాడాయి. ఇన్ని దేశాలకు చెందిన వ్యక్తులతో జరిగిన సామూహిక వివాహాల్లో ఇది రెండోదట!