ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి.. | Farmer whistles and his chickens fly down for the feast | Sakshi
Sakshi News home page

ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి..

Published Sat, Aug 19 2017 7:51 PM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి.. - Sakshi

ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి..

బీజింగ్ ‌: నెమళ్లంతపైకి కూడా పెంపుడు కోళ్లు గాల్లోకి ఎగరలేవు అంటారు. అదంతా అబద్ధమని అంతకన్నా పైకి ఎగురగలమని నిరూపిస్తున్నాయి చైనాకు చెందిన ఓ రైతు పెంపుడు కోళ్లు. ఓ కొండపై ఎక్కడెక్కడో తిండి కోసం వేట మొదలు పెట్టిన ఆ కోళ్లు రైతు ఈల ఊదగానే రెక్కలు అల్లార్చుతూ ఈల వినిపించిన వైపు గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి.

ఒకటి కాదు, పదులు కాదు, వందల్లో వచ్చి రోడ్డుపై అవి ఒక్క చోట చేరాయి. ఆ రైతు తిండి గింజలు వేయగానే అవి వాటిని తినడంలో నిమగ్నమయ్యాయి. చైనాలోని గిఝౌవ్‌ రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఈ పెంపుడు కోళ్లకు ఎంతగా శిక్షణ ఇచ్చాడో తెలియదుగానీ ఆగస్టు 14వ తేదీన రికార్డు చేసిన ఈ కోళ్ల వీడియో మాత్రం ఇప్పుడు ఆన్‌లైన్‌ హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement